[dropcap]ఆ[/dropcap]డ అంటే అక్కడ
ఈడ అంటే ఇక్కడ
అక్కర లేని పదాలు మాకొద్దు
అర్థమయ్యే ప్రేమలే ముద్దు
దీర్ఘం తీసినా, ఒత్తులు పోయినా
ఆప్యాయత మారునా
అనుబంధాలు తీరునా!
నా భాషే గొప్ప అన్న కులుకు
బంధాలపై పెట్టు ఒక కునుకు
అక్షరాలు మనం పుట్టించినవే
పదాలు మనం కన్నవే
మనం ప్రాణం పోసిన భాష
మన కన్నా గొప్ప ఎట్లా
మొత్తం తెల్వని భాష కన్నా
చెట్టంత తెల్సిన మనిషే మిన్న !
పైసల్ సంపాయించు కోనీకి పట్నం పొయ్యి
యాస నేర్సుకోవాలని గుమాయించుకపోకు
షోకులు తక్కువ, పోడిమి ఎక్కువ
యాది పెట్టుకో
దిమాగ్ సక్కగుంటే శాన్ ల ఫరక్ రాదు!
జర భద్రం కొడుకో
నా కొడుకో కొమ్రన్న… జర.. పైలం కొడుకో …