[dropcap]ఓ [/dropcap]నేస్తమా…
ఆప్యాయతల చైత్రమా…
మధురమైన అనుభూతులు మాటలలో పంచావు
స్పందనమ్మ ఒడిలోన పొందికగా నిలిచేవు
సాంస్కృతిక సేవలోన అలుపెరుగక నడిచావు
మధురమైన అనుభవాలు మా మదిన నింపేవు
కళల తల్లి చెంత లేక కనుమరుగైపోయావా…
ఇలా బాధ్యతలు విడిచి దివికేగ తలచితివా
చుక్కలలో చెంద్రుడవై వెలుగునింప తలచి
ధ్రువతార చెంత నీవు ధన్యుడవై నిలిచినావా
అమరలోకాల చెంత ఆప్తుడవై వెలసినావు
మరుజన్మకై నీవు మటుమాయమైనావా
జోహారు రాఘవ! జోహారు రాఘవ!!