నెచ్చెలి

2
3

[dropcap]నీ[/dropcap] వలపు తలపుల తలుపు
తెరిచి నీ ప్రేమను నాకు తెలుపు

నా చిరునగవుతో నీ చిరుతగవు
ప్రేమికులకవి మాత్రము తగవు

క్రీగంట చూసి నా గుండెలో
గుడిగంట మ్రోగించావు

ఉలకవు పలకవు నీవు
రామచిలుకవా, రాతిపలకవా

నా మది సంద్రంలో అల్పపీడనం
ఉప్పెనగా మారక మునుపే
చప్పున నా ప్రేమను చెప్పనీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here