[dropcap]తీ[/dropcap]యని కోయిల గొంతు విని వెదురు చెట్టు కొమ్మ
తనువు పులకరించి తాను వేణువై పలికింది.
చేరని గమ్యం కోసం మేఘం పరుగెడుతూనే ఉన్నా
అవనిపైన మమకారం చిరు జల్లై ఒలికింది.
రాయని కవితలు ఎన్నో మనసులోన ఉన్నా
మధురమైన తలపేదో గానమై పలికింది.
తీరని వ్యథ లెన్నెన్నో నడకను ఆపుతు ఉన్నా
తెలియని ఓదార్పేదో స్నేహమై పలికింది.
మార్పు లేని మనుషులకు అలుపన్నది ఏది శ్రీయా
కనిపించని మనసేదో మానవతై పలికింది.