[dropcap]క[/dropcap]న్నువిప్పని నాడు జగతిన
కడలాడినది మన సంస్కృతి
నాగరికత లేని నాడు పుడమిన
నాట్యమాడినవి నాల్గు వేదములు
విశ్వాసం లేని నాడు ధరణిన
వినువీధికెగరెను విజ్ఞానం
అక్షరాలు తెలియని అవనికి
విశ్వవిద్యాలయం ఈ భారతావని
వైద్య విద్య సాంకేతిక రంగమేదయినా
విశ్వగురువు మన భారతభూమి
అన్నవస్త్రాలు మొదలు ఆయుర్వేదం
అవనికొసగిన అమృతభూమి
చరక సుశ్రుత కణాద ఆర్యభట్టులు
అందించిన విజ్ఞానం ఆచరించిన దేశం
ప్రపంచానికే నేడు మేధో సంపద నా దేశం
వెలుగుదివ్వె ఈ భారతభూమికి
వేనవేల వందనాలు-అభినందనాలు
తెలుసుకో నా యువతరమా!!
గతం నాస్తి కాదోయ్
అది అనుభవాల ఆస్తి
భరత పుత్రుడా మేలుకో..
తలయెత్తి నిలబడు జగజ్జేతవై…
మరో చరిత తిరగరాయి విశ్వవిజేతవై……