[dropcap]స్వా[/dropcap]రాజ్యం వచ్చింది
స్వాతంత్య్రం ఇచ్చింది.
అయినా ఏమి ఫలం?
వచ్చిన ఫలాన్ని సద్వినియోగము చేసుకోలేక
మనలో మత ద్వేషాలు రగుల్చుకుంటూ
భారతావనిని ముక్కలు చేసుకున్నాము.
అందుమూలమున మనకు మిగిలిన ఫలితమేంటే
పాలకుండ లాంటి భరతమాత
మూడు ముక్కలుగా విడిపోయి
మత ద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ
మన సంపదని మన ఐకమత్యాన్ని
మన ఆత్మ గౌరవాన్ని మనమే
చేజేతులార నాశనము చేసుకుంటూ
మత ద్వేషాలను మనము పెంపొందించుకుంటూ సాగిపోతున్నాము.
దీనిని ఆసరగా తీసుకుంటూ కొన్ని దుష్ట శక్తులు
నేనున్నను నీకు
నేనున్నాను నీకు అని
ఇరువురికి స్నేహ హస్తమందిస్తూ
వాళ్ళ పబ్బము గడుపుకుంటున్నారు
మన సంపదను కొల్లగొడుతూ!
ఎదుటవానిది ఆశించకుండా
మన సొంత బుద్థితో మనము ఎదిగిననాడు
మనలను చూచి ఎదుటివాడు
వెనుక అడుగు వేస్తాడు!
దేశ పౌరుడని గర్వపడాలి గాని
ధన పౌరుడనని విర్రవీగకు!
అశాశ్వతమైన ధనము నాశించి
ఇతర దేశాలకు పోయి
నీ తెలివి వాళ్ళకి అమ్మవద్దు!
నీ తెలివి నీకు జన్మనిచ్చిన
జన్మభూమి కందించి
భరతమాత ముద్దు బిడ్డవని గర్వముగా
చెప్పుకున్న నాడే నీ జన్మకి సార్థకత ఉంటుంది!