మరో ప్రపంచం

0
3

[box type=’note’ fontsize=’16’] కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి యం. తేజస్వి వ్రాసిన కథ ” మరో ప్రపంచం“. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]మీ[/dropcap]కు ఒకటి చెబుతాను. మీరు ఎవ్వరికి చెప్పద్దు. మన మిల్కివే గెలాక్సీకి అవతల లైమ్‌లైట్ అనే గెలాక్సీ ఉండేది. అందులో కూడా చాలా గ్రహాలు ఉండేవి. వాటిలో చురి అనే గ్రహం ఉండేది. అక్కడ ఉన్న ప్రతి ఒక గ్రహం మీద మనుషులలాంటి వాళ్లు ఉండేవారు. వాళ్ళు మన మనుషులు కంటే వేయి సంవత్సరాలు తరువాత ఉన్నారు. మన కంటే ఆధునికతతో, టెక్నాలజీలో వంద సంవత్సరాలు ముందు ఉండేవారు. మనకు ఇక్కడ బండ్లు వలె వాళ్ళ దగ్గర కూడా స్పేష్‌షిప్స్ ఉండేవి. అక్కడ  ఏ అవసరం ఉన్నాగానీ పక్క గ్రహాలలోకి వెళ్ళేవారు.

ఆ చురి గ్రహంలో ఒక అందమైన కుటుంబం ఉండేది. అందులో అమ్మ పేరు సురి, నాన్న పేరు మక, వాళ్ళ కొడుకు పేరు రిక.  రిక వాళ్ళ గ్రహంలో వాళ్ళతో పోలిస్తే కొంచెం తెలివి తక్కువవాడు. ఒకసారి తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న స్పేష్‌షిప్ ఎక్కాడు. తెలియకుండా తన సీటు కింద ఉన్న బటన్‌ను నొక్కాడు. ఒక్కసారిగా అతనికి మాటలు వినిపించాయి. అతను ఒక శాస్త్రవేత్త అని ఏదో ఒక రోజు ఆ లైమ్‌లైట్‌ని  దాటడానికి ఒక యంత్రం తయారు చేశాడని చెప్పాడు. రిక ఆందోళనలో పడి వాళ్ళ నాన్నను వెళ్ళి అడిగాడు. అవి అతని నాన్న మాటలని తనని ఆటపట్టించడానికి చెప్పాడని మక చెప్పాడు. అది అంతా ఆబద్దం అని చెప్పాడు. కాని ఆ మాటలు తన మనసులో నాటుకుపోయాయి. పెద్ద అయ్యాక కూడా అతని తెలివి తక్కువ వాడిలాగే ఉన్నాడు. అందువల్ల అందరు దేనికి పనికిరాడని బాధపెట్టేవారు. అమ్మా నాన్న కూడా ఏడ్పిచ్చేవారు.

ఒక రోజు రిక వాళ్ళ అమ్మ అతనిని త్వరగా వెళ్ళి కూరగాయలు తెమ్మని పక్క గ్రహానికి పంపింది. అతను తన స్పేష్‌షిప్‌లో వెళూతూ ఉండగా ఒక్కసారిగా డమేల్ మని అది కుప్పకూలి ఏదో తెలియని గ్రహం మీదకు వెళ్ళి పడింది. అతనికి తెలియని చోట పడింది. దాని లోనుంచి కిందకు దిగాడు. అక్కడ ఏదో ఒక పెద్ద ఆకారం కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ  వస్తువు పై గుడ్డ పరిచి ఉంది. దానిని తియ్యగానే చాలా దుమ్ము పైకి లేచింది. ఆ దుమ్ములో మసక మసకగా ఏదో పరికరం కనిపించింది. దాని లోపలికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ తాతయ్య డైరీ కనిపించింది. దానిని చూశాక తన తాతయ్య చెప్పింది నిజం అని నమ్మాడు. మొత్తం  పరిశీలించాడు. అక్కడ ఒక కుర్చీ లాంటిది ఉంది. దానిలో కూర్చోగానే పెద్ద శబ్దం వచ్చి ఆ బండిలో నుంచి పొగలు రావడం మొదలయ్యింది. ఒక్కసారిగా అది ఆకాశంలోనికి దూసుకెళ్ళిపోయింది. అలా అది నాలుగు రోజులు వరకు వెళ్తునే ఉంది. అది వెలుగు కంటే వేగంగా వెళ్తుందనిపించింది. ఆ తరువాత అతనికి ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళ గ్రహం లాంటి ఇంకొక గ్రహం మీదకు వెళ్ళి ఆగింది. అతనికి  అంతా అయోమయంగా ఉన్పించింది. అది దిగేటప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది. దానికి అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తెరిచేలోపు అందరు అతనిని చుట్టు ముట్టేశారు. వాళ్ళంతా వాళ్ళ గ్రహంలోని పాత కాలపు మనుషుల్లాగే కనిపించారు. దానిని చూసి నిజమా భ్రమా అని ఆందోళనలో పడిపోయాడు. చివరికి అది నిజమేనని తెలుసుకున్నాడు.

అక్కడ అతనికి చాలా వింతగా ఉంది. అందరు వాళ్ళ తాతయ్య చిన్నప్పుడు ఎలా ఉంటారని చెప్పేవాళ్లో అచ్చు అలాగే ఉన్నారు. అతను ఒక అతనిని ఎక్కడున్నానని  అడిగాడు. అప్పుడు అతను భూమి మీద అని వెటకారంగా అన్నాడు. అతను దాని గురించి చదువుకున్నాడని అది మిల్కీవే గెలాక్సీలో ఉందని గుర్తుకు వచ్చింది.

అతని తెలివి వాళ్ళ గ్రహంలో వాళ్ళతో కలవలేదు కాని భూమి మీద మనుషులతో కలిశాడు. ఇక్కడ  అతనికి చాలా బాగా నచ్చింది. అతను తన గ్రహంలో చూసినవన్నీ ఇక్కడ తయారు చేసి ఒక పెద్ద శాస్త్రవేత్త అయిపోయాడు. సంతోషంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి బాధపడడం కంటే ఇక్కడే ఉంటే సంతోషంగా ఉండవచ్చు అని భూమి మీదే ఆగిపోయాడు. కాని ఇప్పటికి అతనికి అంతు చిక్కని విషయం ఏమిటంటే ఇలాంటి లోకాలు ఎన్ని ఉన్నాయి. వాటిలో ఎలాంటి రకాల జీవరాశులు ఉన్నాయి. అసలు మన గెలాక్సీ తరువాత ఏముంది?

చివరిగా ఒక విషయం అతను మీలోనే ఒకడై ఉండవచ్చు జాగ్రత్త…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here