[dropcap]సె[/dropcap]ప్టెంబర్ నెల సంచిక మీ ముందు ఉంది. సంచికలో మీరింకా ఎలాంటి రచనలు ఉంటే బావుంటుందనుకుంటున్నారో సూచించండి. మీకు నచ్చిన అంశంపై, మీకు నచ్చిన రీతిలో రచనలు చేసి ప్రచురణకు పంపండి. రచయితలకు అచ్చుపత్రికలలో, కొన్ని నెట్ పత్రికలలో కలిగిన చేదు అనుభవాలవల్ల వారు రాసింది రాసినట్టు వెంటనే పదిమంది ముందు పెట్టే వీలునిచ్చే సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారు. పత్రికలో ప్రచురణ కోసం ఎదురుచూసే బదులు ఏది రాసినా పదిమంది ముందుపెట్టే స్వేచ్ఛను ఇస్తోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. ఇక్కడ సంచిక ఒక విషయం స్పష్టంగా చెప్తుంది.
సంచిక ఇతర పత్రికల లాంటిది కాదు. సంచికలో ఎడిటర్ లేడు. ఎడిటోరియల్ టీమ్ వుంది. ఈ జట్టులోని వారు అందరూ రచయితలే. పత్రికల ఎడిటర్లు, సబ్ ఎడిటర్లతో అనుభవాలున్నవారే. అందుకనే, ఆరంభంలోనే సంచిక ఒక పాలసీని ఏర్పాటు చేసుకున్నది.
సంచికలో రచనకు, రచయితకు ప్రాధాన్యం. ఇక్కడ రచనను ప్రచురించి ఏదో ఆబ్లిగేషన్ చేసినట్టు ఎడిటర్లు భావించరు. రచనను అందించి రచయిత సంచికకు ఫేవర్ చేసినట్టు భావిస్తారు. అవసరమయితే, ఎడిటర్లు రచయిత ముందు నుంచుని చేతులు జోడించి రచన చేయమని అభ్యర్ధిస్తారు. ఎందుకంటే రచయిత రచన చేయనిదే ఎడిటర్ వుండడు. పత్రిక వుండదు. అందుకని రచనకు, రచయితకు సంచికలో పెద్దపీట. కాబట్టి రచయితలు సంచికకు తమ రచనలు అందించి సంచికను పరిపుష్టం చేయమని ప్రార్థన. ఎలాంటి అనుభవంలేని రచయిత రచన అయినా సంచిక పరిష్కరించి మరీ ప్రచురిస్తుంది.
సెప్టెంబర్ నెల కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జన్మమాసం. ఈ సందర్భం పురస్కరించుకుని వారి కథా సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా తెలుగు సాహిత్యలోకానికి అందిస్తోంది సంచిక. ఈ వ్యాస పరంపర సెప్టెంబర్ 10వ తేదీన ఆరంభమవుతుంది. ఆపై, ప్రతి ఆదివారం వెలువడే సంచికలో ప్రచురితమవుతుంది.
ఈనెల సంచిక తెలుగు సాహిత్యాభిమానులకు అందిస్తున్న రచనల పుష్పమాలలోని విభిన్నమయిన పుష్పాలివి:
ప్రత్యేక వ్యాసం:
స్వాతంత్ర్యవీరుడు – ఇ.ఎన్.వి.రవి
సీరియల్స్:
ముద్రారాక్షసమ్ ద్వితీయాంకం-7 – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
నీలమత పురాణం – 38 – కస్తూరి మురళీకృష్ణ
జీవన రమణీయం-71- బలభద్రపాత్రుని రమణి
ఆమని – 12 – దాసరి శివకుమారి
అనుబంధ బంధాలు – 10 – చావా శివకోటి
పాదచారి-5 – భువనచంద్ర
జానేదేవ్-22 – ముమ్మిడి శ్యామలారాణి
కాలమ్స్:
రంగులహేల-18- డిజాస్టరూ మంచిదే – అల్లూరి గౌరిలక్ష్మి
కావ్య పరిమళం-4 – డా. రేవూరు అనంతపద్మనాభరావు
మానస సంచరరే-23: బొమ్మలాట.. మనసులో మాట – జె. శ్యామల
వ్యాసాలు:
తెలుగునాట గాంధీజీ – కోవెల సంతోష్‌కుమార్
తమిళనాడులో తెలుగు తేజం – కే.ఎస్. కోదండరామయ్య గారు – వి. మంజునాథ శర్మ
వ్యర్థాల నిర్వహణ “0” చేద్దామా? – శివరంజని
కథలు:
అపురూప బంధం – సుధా ఆత్రేయ
భీమవరం భీమరాజు – కేశవరాజు సుబ్బారావు
గుండె నిండా జీలుబండనే – గుళ్ళపల్లి నిరంజన్
కవితలు:
వామ్మో…! – శ్రీధర్ చౌడారపు
కాలవ కింద – లోలా కోసూరి
పెళ్లి పత్రిక – Savvy
ఖండకావ్యం:
నవమి – ఖండం 3: జలజమా – చేతన
గళ్ళ నుడికట్టు:
పదసంచిక-17: కోడిహళ్ళి మురళీమోహన్
భక్తి పర్యటన:
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 58: మాచర్ల – పి.యస్.యమ్. లక్ష్మి
సినిమాలు:
‘వైరస్’ – సమీక్ష – పరేష్. ఎన్. దోషి
ప్రాంతీయ దర్శనం -32: సంస్కృతం – నేడు – సికిందర్
బాలసంచిక:
తాతయ్యా కథ చెప్పవా – ఆర్. శ్రీజ
పుస్తకాలు:
మధుమాలిక (కథా సంపుటి) – పరిచయం – సంచిక టీమ్
అనాచ్ఛాదిత కథ (నవల) – సమీక్ష – కె.పి. అశోక్‍కుమార్
ఈ నెల రెండో తేదీ వినాయక చవితి సందర్భంగా పాఠకులకు, రచయితలకు, రచయిత్రులకు పండుగ శుభాకాంక్షలు అందిస్తోంది సంచిక.
– సంపాదక బృందం.