పదసంచిక-18

0
3

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నాదేశం పావన గంగ, నాదేశం ___________ సినారె సూక్తి. (6)
4. ఇటీవల బలవన్మరణం పొందిన ప్రముఖ రచయిత్రి (4)
7. మెకానిక్కు నీల్గుడు (2)
8. రసికత నడుమ జుట్టు (2)
9. అమరావతి కథలు సృష్టికర్త (2,5)
11. వెనుకటివాడు తోటను కలిగివున్నాడు. (3)
13. కలివిడి కోడలు అత్యంత అరుదైన, అంతరించిపోతున్న పక్షిని దాచుకుంది. (5)
14. తమిళ భాషలోని వైష్ణవ భక్తి గీతములు (5)
15. భాజపా గుర్తు (3)
18. వైకుంఠపాళీలో ఇవి ఉన్నాయి. (4,3)
19. జామాతలో తాత తనయ (2)
21 కాబాలో ఊదేది (2)
22. గ్రామాలలోని సమావేశ స్థలము (4)
23. కన్యాశుల్కం సినిమాలో అగ్నిహోత్రావధాన్లు పాత్రధారి ఈ విన్నకోట వారు. (3,3)

నిలువు

1. గరిష్ఠము కానిది. అల్పము. (4)
2. గిరుక్కున సూర్యకిరణం చూడండి.  (2)
3. మల్లావధాని, రాజారావు, నరసింహారావుల ఇంటి పేరు. అన్నట్లు సినీనటి జి.వరలక్ష్మి ఇంటి పేరు కూడా ఇదే. (5)
5.    సిద్ధుని తిరగేసి పిలవండి. (2)
6.    మనోవాక్కర్మలు. (6)
9.     ధర్మవరం రామకృష్ణాచార్యుల వారి డ్రామా ట్రూపు (3,4)
10.  సదా గుర్తుంచుకోవలసిన వారు. (7))
11.   కవాడిగూడలో ఉపనిధి లభ్యం (3)
12.    లంకపాలెంలో పుర్రె (3)
13.     కందుకూరి అనంతము గారి కలంపేరు (6)
16.     బొరుగులు కలగలిసిపోయాయి. (6)
17.     నాటకాలు. రూప అనే ఆవిడ చరణము కాదు. (4)
20.     మోసము (2)
21.     ఆడేలు బాపతు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను సెప్టెంబరు 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 22 తేదీన వెలువడతాయి.

పదసంచిక-16 జవాబులు:

అడ్డం:

1.శ్రీ శంకర కృప  4.విజయశ్రీ/ఉదయశ్రీ 7.నాకు 8.శంపా 9.నడుస్తున్న చరిత్ర 11.సావిత్రి 13.అచ్చతెనుగు 14.పుష్పకేతువు 15.కతుర 18.రసికాగ్రగణ్యుడు 19.లిసా 21.నావ 22.కనకాంగి 23.ముక్తేవిభారతి

నిలువు:

1.శ్రీనాథుడు 2.శంకు 3.పరాన్నజీవి 5.యశం 6.శ్రీపాదరేణువు 9.నల్లంచుతెల్లచీర 10.త్రయంబకేశ్వరుడు 11.సాగుక 12.త్రిపుర 13.అక్షరతూలిక

16 తుషగ్రహము 17.ఐరావతి 20.సాన 21.నార.

పదసంచిక-16కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఈమని రమామణి
  • జి.ఎస్.బద్రీనాథ్
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • సుభద్ర వేదుల
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here