[box type=’note’ fontsize=’16’] కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని టి. లక్ష్మీ యశస్విని వ్రాసిన కథ “కోరిక!!!”. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]
[dropcap]ఒ[/dropcap]కానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమ్మాయి పేరు సన్ని.
తనకు అమ్మా, నాన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి లేరు. సన్ని వాళ్ళ తాతయ్యతో ఉంటుంది.
సన్ని వాళ్ళ తాతయ్య తనకు ప్రతీ రోజు తను నిద్రకు వెళ్ళేటపుడు ఒక కథ చెప్పేవాడు.
ఒక రోజు ఎప్పటిలాగే సన్నికి వాళ్ళ తాతయ్య కథ చెబుతూ వుండగా సన్నికి ఆ కథ చాలా బాగా నచ్చింది. ఆ కథ బాగా వింటూ ఉంది.
అప్పుడు ఆ కథ కళ్ళకి దృశ్యం అయింది. అప్పుడు సన్ని ఆ కథలో మునిగిపోయింది. ఆ కథలో మొదటి పేజిలో కొన్ని అద్భుతాలు చూచి ఆశ్చర్యపడింది.
అది ఒక అందాల ప్రపంచం. అక్కడ విచిత్రమైన మనుష్యులు, నదులు, జంతువులు, గ్రామాలు.
రెండో పేజీలో తనుకూడ విచిత్రమైన అదిరిపోయో బట్టలలో మారింది.
అప్పుడు మూడవ పేజీలో తనకు నచ్చినవి తన కళ్ళ ముందు కనిపించాయి. తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే తన అమ్మ నాన్నని అడిగితే నా కళ్ళ ముందు వస్తారా అని అనుకుని గట్టిగా ఒకసారి అరిచింది.
కాని రాలేదు. ఆలా ఎన్నో సార్లు అరిచింది. చివరికి వాళ్ళ అమ్మా, నాన్న తన తమ్ముడితో కళ్ళముందు నించుంటారు.
నాలుగో పేజీలో వాళ్ళ నలుగురు సంతోషంగా కలిసి మెలిసి ఉంటారు. సన్నీ అనుకున్న కోరిక వాళ్ళ అమ్మా, నాన్నా తమ్ముడితో తీరిపోయాయి.
తను, వాళ్ళ అమ్మా నాన్నా తమ్ముడు – సన్నీ వాళ్ళ తాతయ్య ముందు ప్రత్యక్షమయ్యారు.
టి. లక్ష్మీ యశస్విని