[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రామాయణమును రచించిన స్త్రీ మూర్తి. (4,2) |
4. అడ్డము 1కి విశేషణము. (4) |
7. అవనితలములో ఒక అధోలోకము తొలగిస్తే అడవి మిగులుతుంది. (2) |
8. సుదీర్ఘమైన రాత్రి పతిలేకుండా ఎలా పక్షపాతీ? (2) |
9. అడవి, పాచి, రంజీ పదాలతో నవలా రచయిత. (3,4) |
11. వెనుక నుండి బిరుసుగ సొరగు లాగితే అందమా?(3) |
13. లోక్‌సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు (3,2) |
14. కళ అనే ఆవిడ మనసు కాదు లలిత కళలపై ఇష్టం. (5) |
15. ప్రకాశించినది (3) |
18. ప్రాంతీయ, మతకుల, ధనికపేద, చిన్నాపెద్ద వంటి భేదాలు (7) |
19. చిన్న కాలువలలో కఱ్ఱలతో కట్టిన అడ్డము (2) |
21. వాపురోగము (2) |
22. మూడు సమానమైన భాగములు. (4) |
23. తెలంగాణా సాయుధపోరాటంపై వెలువడిన నవల మృత్యుంజయులు వ్రాసిన రచయిత కుడినుండి ఎడమకు. (6) |
నిలువు
1. గోదారిన తానొక్కమారు తడవని వాడును కూరిమిన ______ ను ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడు. (4) |
2. హనుమంతునిలో తూ.గో.జిల్లా పట్టణం (2) |
3. గజదొంగ కాదు కాబట్టి చిందరవందరయ్యాడు. (5) |
5. చంద్రుడు బోల్తా పడ్డాడు. (2) |
6. ట్రిపుల్ యాక్షన్ (6) |
9.గులాబీలు జ్వలిస్తున్నాయి అనే కవిత్వం వ్రాసిన కవయిత్రి (4,3) |
10.ఎన్టీరామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన 1965నాటి సినిమా (3,4) |
11. భారత మాజీ అటార్నీ జనరల్ ఇంటిపేరు తారుమారు. (3) |
12. పెంకె ఆవు (3) |
13. నవరసాలలో ఒక రసం. (3,3) |
16. పాతతరం సినిమా హీరో. పంజరంలో పసిపాప, కోటలో పాగా తదితర సినిమాలలో నటించాడు. (1,4) |
17. పదమూడవ తిథి (4) |
20. వంటలక్కలో క్రిమిజము. (2) |
21. అత్త మొగుడు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను సెప్టెంబరు 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 29 తేదీన వెలువడతాయి.
పదసంచిక-17 జవాబులు:
అడ్డం:
1.ఉభయతారకం 4.భృంగరాజ 7.సిగ్గు 8.మన 9.గోకర్ణశయనుడు 11.కలప 13.వేరుకుంపటి 14.కోటీశ్వరుడు 15.పసిడి 18.డునుర్దమయళీకా 19.రసం 21.కోవా 22.ముఖ్యమంత్రి 23.కలనితపసి
నిలువు:
1.ఉసిరిక 2.భగ్గు 3.కంతశక్ష్మీల 5.రామ 6.జనమేజేయుడు 9.గోకర్ణ కుండలుడు 10.డుథునాశ్వవిశికా 11.కటిప 12.పకోడి 13.వేణీసంహారము 16.సిరా మరక 17.సహవాసి 20.సంఖ్య 21.కోప
పదసంచిక-17కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- సుభద్ర వేదుల
- తాతిరాజు జగం
- ఊకదంపుడు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.