[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఏకాంబరనాథన్ అనే వ్యక్తి కనిపెట్టిన ఒకరకం రాట్నం. (3,3) |
4. బాటసారి మోవి పొలాలకు నీరిచ్చే పెద్దబావికై వెదుకుతోంది. (4) |
7. సుచరితను కాస్త గంజి అడుగు. (2) |
8. టమాట లేదుట.ఇది వృత్తాంతము. (2) |
9. 1947నాటి పల్నాటి యుద్ధం సినిమాలో కొమ్మరాజు పాత్రధారి ఈ గిడుగువారి అబ్బాయి. (3,4) |
11. బెదురు, భయము. (3) |
13. బార్డ్ (5) |
14. పరిమాణమును కొద్దిగా మార్చిన మార్పు (5) |
15. పాణిని, పతంజలి మొదలైనవారు (3) |
18. ప్రభాకీటము (4,3) |
19. తిరగేసిన రవ్వ కేసరి కుప్ప. (2) |
21. కాంపిటీషను (2) |
22. ఆచమనాదుల కుపయోగించు స్పూను. (4) |
23. కుబేరుడు. (6) |
నిలువు
1. అంబా రాచబాటలో బ్రహ్మదేవుడు అగుపించాడా? (4) |
2. హద్దు ఎరిగిన నీలాంబరి (2) |
3. స్మైల్ గారి పేరు పొందిన రచనల సంపుటి (2,3) |
5. ఒబామా తల కొట్టేసిన బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమి (2) |
6. చిందరవందర (6) |
9. ఆపద మ్రొక్కులవాడు. (5,2) |
10. పాయసం (7) |
11. గోధిక (3) |
12. అడ్డం 11 జంటపదం అస్తవ్యస్తంగా. (3) |
13. భూమి భాష, కట్టెలమోపు కవి. (2,4) |
16. దారుకీటము తడబడింది. (5) |
17. ఏనుగును తోలువాడు.(4) |
20. ఆయిత్తమైనది. (2) |
21. సంగ్రామము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను అక్టోబరు 01వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా అక్టోబరు 06 తేదీన వెలువడతాయి.
పదసంచిక-18 జవాబులు:
అడ్డం:
1.కరుణాంతరంగ 4.జగద్ధాత్రి 7.నిక్కు 8.సిక 9. సత్యంశంకరమంచి 11.వాటిక 13.కలివికోడి 14.పాశురములు 15.కమలం 18.నిచ్చెనలుపాములు 19.మాత 21.బాకా 22.రచ్చబండ 23.రామన్నపంతులు
నిలువు:
1.కనిష్ఠము 2.రుక్కు 3.గరికపాటి 5.ద్ధాసి 6.త్రికరణములు 9.సరసవినోదిని 10.చిరస్మరణీయులు 11.వాడిక, 12.కపాలం 13.కరుణకుమార 16.మరలుమరా/మమలురరా 17.రూపకాలు 20.తచ్చ 21.బాతు
పదసంచిక-18కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- జి.యస్.బద్రీనాథ్
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రాజేశ్వరి రావులపర్తి
- సుభద్ర వేదుల
- శుభా వల్లభ
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.