[dropcap]ఒ[/dropcap]క్కోసారి
చెట్టు మాటలు వినాలని
ఎందు కనిపిస్తుందోనని
చాలా ఆశ్చర్యం!
ఇంకేం శబ్దాలు నచ్చవు
మా ఇంటికి దగ్గర్లోనే ఉన్నది
రోజూ దాన్ని బెదిరిస్తూనే ఉంటారు
మన సంతోషాల కోసం
నేలను అలా కొలుస్తూ కొలుస్తూ
దానికి దగ్గరగా వెళ్తారు
తీరా… అంత దగ్గరి కెళ్ళాక
గాలిలో కలిసి విన్పించిన దాని మాతలు
ఎప్పటికీ వదలని జ్ఞాపకాలు
వయసుతో పాటు పెరిగిన జ్ఞాన విస్తృతితో
నా కాళ్ళు నేలలో దిగబడిపోయి
నా తల భుజాలకి దూరమైంది
కొన్నిసార్లు ఆ చెట్టుకేసి
అలా చూస్తుండిపోతే
కిటికీలోంచో తలుపులోంచో
బల్లలోంచో కుర్చీలోంచో
నా చుట్టూ అల్లుకునే కనిపిస్తుంది.
దానికి భయమేసినప్పుడల్లా
తెల్లని మేఘాన్నై కౌగిట చేర్చుకుంటాను
కొన్నాళ్ళకి… మరి కొన్నాళ్ళకి
దానిని చూడాలన్నా నేనే ఉండను కదా!