అమ్మ ప్రేమ

0
4

[box type=’note’ fontsize=’16’] కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని బి. జాహ్నవి వ్రాసిన కథ “అమ్మ ప్రేమ”. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]నే[/dropcap]టి కాలంలో తల్లి  పట్ల పిల్లలు ఎలా ఉన్నారో చూద్దాం. ఈ కథను చూసి అందరు చదివి మంచిగా తల్లిని చూసుకునేలా మారాలి అని అనుకుంటున్నాను.

అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు విజయరామాపురం. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుంటుంబంలో అమ్మ, నాన్నా, పిల్లాడు ఉండేవారు. అయితే వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మకు బిడ్డను ఎలా పెంచాలో ఆమెకు అర్థం కాలేదు.

ఆమెకు సరిగ్గా ఆహారం లేకపోవడం, ఆమె పనికి వెళ్లి, కూరగాయలు అమ్ముకొని వచ్చిన డబ్బు సగం దాచి పెట్టి సగం డబ్బుతో బియ్యం తెచ్చి ఆ పిల్లాడికి అన్నం పెట్టి బడికి పంపేది. అక్కడ మిగిలితేనే అమ్మ అన్నం తినేది లేకపోతే వారి కొడుకును చూసి ఆకలి తీర్చుకునేది. ఆమె చాలా కష్టపడి డబ్బు సంపాదించి మిగిలిన సగం ఆ పిల్లాడి చదువుకు పెటి ఆ పిల్లోన్ని చదివించేది. డబ్బు లేకపోయినా ఆ పిల్లోని ప్రైవేట బడిలో చేర్చి ఆమె కష్టపడి సంపాదించి పెట్టేది.

ఆయితే ఒక రోజు ఆమె కూరగాయలతో ఒక గ్రామానికి వచ్చింది. ఆ గ్రామంలో ఆమె కొడుకు చదువుతున్నాడు. ఆమె తన కొడుకును చూడాలని కోరికగా వెళ్ళింది. అప్పుడు ఆమెను ఎవరు చూడకముందే వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి “అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు. నువ్వు చూడటానికి అసహ్యంగా ఉన్నావు” అని తిట్టి పంపించాడు. అప్పుడు వాళ్ళమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పిల్లాడు సరిగ్గా కనపడలేదని ఆమె గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి కంటి ఆపరేషన్ చేయించుకంది. అప్పుడు మళ్ళీ కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళి కొడుకును చూడాలనిపించి వెళ్ళింది. అప్పుడు వళ్ళీ వచ్చి ఆ కొడుకు మళ్ళీ తిట్టాడు. “నీ కళ్ళు చూడు నాకే అసహ్యంగా” ఉంది అని తిట్టాడు.

మళ్ళీ ఆమె బాధతో వెళ్ళిపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చి ఆమె రోజు వస్తుందని, రాకుండా చేయాలని అనుకున్నాడు. ఆప్పుడు వాడికి ఒక ఆలోచన తట్టింది. ఆప్పుడా పిల్లాడు వాళ్ళ అమ్మని అడిగాడు. “అమ్మా నేను ఇక్కడ చదువుకోలేకపోతున్నాను. ఎకడికైనా దూరంగా వెళ్ళి అక్కడ వుండి చదువుకుంటాను” అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మొదటగా ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు నా కొడుకు తప్ప ఇంక ఎవ్వరు లేరు. కొడుకును చూడకండా ఉండలేను అని చెప్పింది. అప్పుడు వాడు “అమ్మా పంపిస్తావా లేదా” అని గట్టిగా అరిచాడు (గదిరించాడు). అప్పుడు వాళ్ళ అమ్మ ‘సరే’ అంది ఏడుస్తూ. “ఏ బడికి వెళ్ళతావు నాయనా నాకు కొంచెం దారి చెప్పు” అని అంది.

అప్పుడు వాడు “నీకేందుకు దారి చప్పడం” అని అన్నాడు. “అప్పుడప్పుడు నేను వస్తుంటాను” అంది. “నువ్వేమి రానక్కర్లేదు. నేనే వచ్చిపోతుంటా” అని అన్నాడు.

అప్పుడు దూరానికి వెళ్ళాలంటే డబ్బు ఇంకా కష్టపడి డబ్బు సంపాదించాలని ఇంకా ఎక్కువ పని చేసి డబ్బు సంపాదించి డబ్బు కట్టి ఆమె కష్టం చేసి, చేసి ఆరోగ్యం కోల్పోయింది. వాళ్ళ కొడుకు కష్ట పడి బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి ఒక పెద్ద ఇల్లు కట్టించి భార్యా పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ ముసలాడివిడ అయిపోయింది. అప్పుడు ఆమె వారింటికి వచ్చింది. అప్పుడు ఆమెను చూసి అసహ్యించుకొని ‘ఎవరు నువ్వు’ అని బయటకు నెట్టాడు.

అప్పుడు ఆమె బాధతో ఆకలికి అలమటించుతుండగా ఒక ఆయన చూసి ఆమెను “ఎవరమ్మా నువ్వు ఎందుకు ఇక్కడున్నావు” అంటే “అయ్యా నేను ఈ ఇంటి ఆయన అమ్మను నాయనా. ఆయన నన్ను కనుక్కోలేకపోతున్నాడు” అంది. సరే అని చెప్పి ఆయన వారింటికి తీసుకెళ్ళి ఆమెకు కడుపునిండా అన్నం పెట్టాడు. అప్పుడు వారి కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి “అరె ఆమె మీ అమ్మ అయ్యా” అని చెప్పాడు. “మా అమ్మ ఎక్కడో ఉంది. ఆమె ఎక్కడుందో నాకే తెలియదు. ఎవరినో తీసుకొచ్చి మా అమ్మ అంటావెందుకు వెళ్ళు” అని నెట్టాడు. “ఆమె ఎక్కడుందో తెలియదు” అని అన్నప్పుడే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. అప్పుడు వాళ్ళ కొడుకు వెళ్ళి దగ్గరికి చూసాడు. ఆమె కళ్ళు చూసి ఆమె మా అమ్మ అని బాధ పడ్డాడు. అప్పుడు ఆయన “ఎందుకొచ్చావు ఈ అమ్మ కాదు”  అని తిట్టాడు. అప్పుడు కొడుకు బాధతో వెళ్ళిపోయాడు.

నీతి- ఎప్పుడైనా తల్లిదండ్రులు మనకు విలువైనవారు. తల్లిదండ్రులు మన కోసమే కష్టపడతారు అనేది మరచి పోకూడదు. తల్లిదండ్రుల గుణం తెలుసుకోవాలి. వారి రుణం మనం తీర్చుకోవాలి.

B.JAHNAVI, 9th Class

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here