[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మరణించె (4,2) |
4. కలత లేక తలపుమానికము కలిగిన సంధ్య. (4) |
7. శకుంతల వద్ద నున్న బల్లెము (2) |
8. టర్కీదేశపు కరెన్సీ (2) |
9. చిలుకూరి దేవపుత్ర వ్రాసిన హాస్యకథ. వానీ తమ్ముడు సో… (3,3,1) |
11. వెయ్యి లుబ్ధులున్న గుడారంలో చీకటి ఎక్కడ? (3) |
13. తొలగు. అకర్మక క్రియ. (5) |
14. ధనమేరా అన్నిటికి మూలం అని ఆరుద్ర ఘంటసాల నోట పలికించిన సినిమా (5) |
15. జిల్లేడు (3) |
18. మొదట్లోనే తడబడిన కెందామర (7) |
19. సరళరేఖను కుదిస్తే అంగీకారమే. (2) |
21. భువిని తిరగేసిన భర్త (2) |
22. ఫేస్ టు ఫేస్ (4) |
23. నీరు గుటకవేస్తూ త్రాగినప్పుడు వచ్చే ధ్వని (6) |
నిలువు
1. మొక్కవోని స్థైర్యము (4) |
2. బిడ్డ కూడా (2) |
3. చిత్తరువులు బట్లరింగ్లీషులో. (5) |
5. ఎన్నార్ చందూర్ నడిపిన మాసపత్రిక. జగతి కాదు. (2) |
6. పురాణంలో ఇతిహాసమా? (6) |
9. ఓట్ ఆఫ్ థాంక్స్ (3,4) |
10. అసహనము (7) |
11. ప్రవాహము (3) |
12. రంగులకలలో సన్నని రాయి. (3) |
13. వెన్నెముకలోని రెండవ పూస (6) |
16. చంద్రుడు (5) |
17. కాకి (4) |
20. రేఖను కేకెయ్యండి. (2) |
21. త్యజించు – కాలు త్యజించు విలుకాడు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 అక్టోబరు 29వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 నవంబరు 03 తేదీన వెలువడతాయి.
పదసంచిక-22 జవాబులు:
అడ్డం:
1.కుమారసంభవం 4.ఎలమావి 7.బేడ 8.రుజ 9.పరకాయప్రవేశం 11.మురయా 13.మహావీరుడు 14.తలపకారం 15.తపన 18.క్రయవిక్రయములు 19.దంభం 21.సైకో 22.గంగిరెద్దు 23.ముత్యాలసరాలు
నిలువు:
1.కుబేరాక్షి 2.మాడ 3.వంకాయకూర 5.మారు 6.విజయనగరం 9.పరమవీరచక్ర 10.శంకరపదములు 11.ముడుత 12.యాతన 13.మరణమృదంగం 16.పరాక్రమము 17.మెచ్చుకోలు 20.భంగి 22.సైరా.
పదసంచిక-22కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.