[dropcap]ఎ[/dropcap]దురు చూపుల మబ్బులు
కనుల కురిసిపోయాయి
పలకరింతలకాలం మొదలైనట్టుంది
వానచినుకులూ
కాంతి స్నానం చేస్తున్నై
వన్నెల ఇంద్ర ధనువులందుకే
వంపుతిరిగి పిలుస్తునై
ఒక నుంచీ ఇంకొక లోనికీ ప్రవాహం
పులకింతలసుడుల అలలు
సముద్రాలై పొంగుతున్నై
సమ్మోహనంగా గాలిలో ఎగిరే
రంగు రెక్కల పూలు
విరిసిన తీరమంతా
తమకపు పరిమళం పరుచుకుంటోంది