[dropcap]ఆ[/dropcap]ది మానవుల ఎమోజీలు
కొండ గుహల్లోని గీతలు
అర్థాలు వెతుక్కున్నాం!
భాషలోకి మార్చుకున్నాం…
నాగరికతను పెంచుకున్నాం
అక్షరాలను సుసంపన్నం చేసుకున్నాం.
ఆధునిక మానవుల ఎమోజీలు
గూగుల్‌లో నిక్షిప్తం
చిహ్నాలను అక్షరాలలోకి మార్చిన మనం
మాటలను గుర్తుల్లో వెతుక్కుంటున్నాం
విచిత్రం – ఎమోజీల సైకిల్.