నీలమత పురాణం – 46

0
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]దు[/dropcap]ర్గ గుడిలో ఆయుధ పూజ జరిపిన తరువాత, మరుసటి రోజు శుభ్రంగా స్నానం ఆచరించాలి. ఇంతకు ముందుకు మల్లే పూజలు జరపాలి. తరువాత భోజనం చేయాలి. సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి మళ్లీ పూజలు చేయాలి. శాలిహోత్ర పూజలో నిష్ణాతులు ఈ నీరాజన పూజ గురించి తెలిసిన వారై ఉంటారు. ఈ శాలిహోత్ర పూజ గురించి తెలిసినవారు అధర్వవేదం, ఖగోళ శాస్త్రం వంటివాటిలో నిష్ణాతులై ఉంటారు. ఈ పూజల తర్వాత నాటకాలు వేస్తూ జీవికను సాగించే వారిని పూజించాలి.

సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు అగస్త్య మహర్షిని పూజించాలి. పూర్ణకుంభాలు, కూష్మాండం, బార్లీ, ధాన్యాలు, నెయ్యి, పద్మ, ఉత్ఫల పూలతో, గందం, తిల, ఎద్దు, బట్టలు, ముత్యాలు, గొడుగు, పాదరక్షలు, దండ, పరమాన్నం, పూలు, ఔషధాలు పలురకాల తినుబండారాలతో పూజించాలి. ఈ సందర్భంగా ఏదో ఒక పండును తినటాన్ని సంవత్సరం పాటు వదిలేయాలి. అగస్త్యుడిని పూజించిన తరువాత జ్యోతిష శాస్త్రవేత్తని పూజించాలి. జ్యోతిష్యుడు దర్శింపజేసే అగస్త్యుడిని ఆకాశంలో దర్శించాలి. అగస్త్యుడిని దర్శించినవారు కోరిన కోరికలు నెరవేరుతాయి.

పంటలు పండినప్పుడు జ్యోతిష్కుడు నిర్ణయించిన ముహూర్తంలో దేవతలను – అశ్వాలను, నీటిని, అగ్నిని, బ్రాహ్మణులను పూజించాలి. బ్రాహ్మణులను, జ్యోతిష్కులను పూజించిన తరువాత కొత్తబట్టలు ధరించాలి. అందంగా అలంకరించుకోవాలి. తూర్పు వైపు తిరిగి కూర్చుని వేద పఠనం చేయాలి.

బ్రహ్మ పటాన్ని చిత్రించి, అనంతుడితో పాటు దిక్పాలకుల బొమ్మలు గీయాలి. గంధం, బట్టలు, ఆభరణాలు, పళ్లు, ఇతర తినుబండారాలతో పూజలు చేయాలి. పాయసం బ్రాహ్మణులకు, సేవకులకు, బంధువులకు పంచాలి. కేవలం రాత్రిపూటనే భోజనం చేయాలి. ఉదయం పూట భోజనం చేయకూడదు.

శుక్లపక్షంలో అయిదవరోజున వరుణుడిని పూజించాలి. ఉమాదేవిని పూజించినట్లే ధనాదను పూజించాలి. ఆరవ రోజున కన్యలు శుభ్రంగా స్నానం చేయాలి. ఏడవ రోజున వారు అందంగా అలంకరించుకోవాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ శుభ్రంగా తయారై అందంగా అలంకరించుకోవాలి. ఎనిమిదవ రోజంతా  స్త్రీలు పురుషులు అందంగా నృత్యాలు చేయాలి. పాటలు పాడుకోవాలి. సుఖించాలి. సంబరాలు పూర్తయిన తరువాత శుభ్రంగా స్నానం చేసి ‘అశోకిక’ అన్న దేవతను పూజించాలి. పూలు, పళ్ళు, ఆహారం, ధూపం, శయ్య, దుప్పటి వంటివి అర్పించాలి. పాయసం తినాలి.

ఐశ్వర్యం కోరేవారు ఉమాదేవిని పూజించాలి.  వితస్త జన్మదినానికి మూడురోజుల ముందు, మూడు రోజుల తరువాత ఆహార సేవనంపై నియంత్రణ గల వ్యక్తులు వితస్త నదిలో స్నానం చేయాలి. ఈ ఏడు రోజులు వితస్త నదిని పూజించాలి., సుగంధ ద్రవ్యాలు, పూల మాలలు, తినుబండారాలు అర్పించాలి. దీపాలతో అలంకరించాలి. పలురకాల జెండాలు, ఎర్రటి దారాలు, గాజులు, పలురకాల ఫలాలు అగ్నికి, బ్రాహ్మణులకు సంతృప్తి కలిగే రీతిలో అందించాలి. వితస్త జన్మదినం తరువాత మూడు రోజులు నృత్యాలు నాటకాలు సాగాలి. ఆ తరువాత నటీనటులకు పలు రకాల బహుమతులు ఇవ్వాలి. 12వ రోజున ఉపవాసం ఉండాలి. హరిని ధ్యానించాలి. పన్నెండవ రోజున శ్రాద్ధకర్మలు జరిపిన వారు శుభాన్ని పొందుతారు.

సూర్యగ్రహణం రోజున నదీ సంగమంలో స్నానం చేయటం శ్రేయస్కరం. ఆరోజు నదీ సంగమంలో స్నానం చేసి దానం ఇచ్చిన వారు శుభ లోకాలు పొందుతారు. రెండు జతల పాదరక్షలు, గొడుగు, పూర్ణకుంభం, కొత్త బట్టలు దానంలో ఇవ్వాలి. ఈ సమయంలో వితస్త సింధూ నదుల సంగమంలో స్నానం చేయటం ఉత్తమం.

ఆశ్వయుజ మాసం నాలుగో రోజున అందరూ దేవతలను పూజించాలి. పునిస్త్రీలకు, పతివ్రతలను, సోదరీమణులను, ఇతర స్త్రీలను పూజించాలి. చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు ఉచ్చైశ్రవాన్ని పూజించాలి. ఒక వేళ ఇది తొమ్మిదవ రోజున సంభవిస్తే అశ్వాన్ని పూజించాలి. వాయువు, వరుణ, సూర్య, శుక్ర, విష్ణు, విశ్వ దేవతలు, అగ్నికి సంబంధించిన మంత్రాలు చదువుతూ అగ్నిహోత్రుని పూజించాలి. ఈరోజు అశ్వాలను కొట్టడం కానీ, అధిరోహించడం కానీ చేయకూడదు.

చంద్రుడు శుక్రునితో కలసి ఉన్నప్పుడు కుంబర, శ్రవణ, పద్మదంత, వామన, సపత్రిక, అంజన, నీల ఏనుగులను పూజించాలి. అశ్వాలను పూజించిన విధంగానే ఏనుగులను పూజించాలి.

ఎనిమిదవ రోజున భద్రకాళిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సుగంధ ద్రవ్యాలు, పూల మాలలు,  శుభ్ర వస్త్రాలు, దీపాలు, ఆ భరణాలు, పండ్లు, ఔషధాలు, మాంసం, కూరగాయలతో దేవిని పూజించాలి. యజ్ఞం చేయాలి. బిల్వపత్రం, గంధం, నెయ్యి వంటి పదార్థాలతో రకాల రసాలతో దేవుని పూజించాలి. నృత్యాలు, పాటలతో రాత్రంతా జాగారం చేయాలి.

దుర్గాదేవి మందిరంలో శాస్త్రాలను పుస్తకాలను పూజించాలి. పనివారు తమ పని స్థానాలను పూజించాలి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here