[dropcap]వి[/dropcap]శ్వవిద్యాలయములందు విషప్రచారం, ద్రోహ చర్యలు
దేశద్రోహులు, రాక్షసులకు దివ్య నీరాజనము లిచ్చిరి.
మతోన్మాదము, ఉగ్రవాదము కూపిరూదిన చోద్యములతో
వాస్తవము వక్రీకరించి తీవ్రవాదుల స్వాగతించిరి.
తప్పు దారిన నడుచు యువతను వీపు తట్టిరి, వినోదించిరి.
పార్లమెంటు సభల మీద బాబులేసిన బటాచోర్లకు
కాశ్మీర్ స్వతంత్రమన్న కాకిమూకల నాయకులకు
మద్దతిచ్చిరి బూట్లు నాకుచు తిరోగమనము మేధావులు
భరతదేశ వినాశనమునకు జోరు యుద్ధము చేతు మనిరి
దేశభక్తికి భాష్యమున దావానలమ్మెగ దోసిరి.
సూటుబూటు వాలాలమంటు మాటలను ఈటెలుగ విసిరిరి
తాను మాత్రం తగదునమ్మా అంటూ తన తప్పులను మరిచిరి
దేశగౌరవ ప్రతిష్ఠలను దెబ్బదీస్తూ, మురిసిపోతూ
దేశమేమైపోతేనేమి, తాము హాయిగా ఉంటమనిరి.
నిందలను విందులగ జేసి పసందుగ కాలమ్ము గడిపిరి.