[dropcap]అం[/dropcap]గీకార అనంగీకారాల నడుమ
కన్నీటి తెర నా మనసులోని సుడిగుండాలకు సంకేతం
కనుల గడప దాటడానికి నీరు చూపిస్తున్న ఉత్సాహం
హృదయానికి మనస్సుకి నడుస్తున్న హోరా హోరీ పోరాటం
నీతో ఉన్నా నేను నాలా లేనన్న భావన
నీతో లేని ప్రతి క్షణం నువ్వే నేనన్న సుభావన
తడబడే ఊహలు కంగారు పడే కనుదోయలు
ఒయాసిస్సుని తలపించే నీ సమక్షం
ప్రేమ అన్న ‘వ్యతిరేక’ ప్రతిచర్యకి హేతువా అన్న చిన్న సందేహం
నా కనుపాపలోని నీ ప్రతిమని మసక చేస్తున్న
కన్నీరుకి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నం
కనురెప్పలు మూసిన ఆ చిరు క్షణం
ఉప్పటి స్రావానికి స్వాతంత్ర దినం
అవి ఆనంద భాష్పాలా కాదా తెలీని స్థితి
పెదవులపై చిన్ని చిరునవ్వు మాత్రం చెక్కు చెదరని అతిథి
దేని దారి దానిదే
నువ్వే నా నగ[వు] అన్న ఊహ సరైందే!