‘బలివాడ కాంతారావు కీ కహానియాం’ పుస్తకావిష్కరణ సభ

0
3

[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 29 అక్టోబర్ 2019 తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆచార్య కె. లీలావతి గారి అనువాద రచన “బలివాడ కాంతారావు కీ కహానియాం” ఆవిష్కరణ వారి నివాసగృహంలో జరిగినది.

సభకు విశాఖ సాహితి అధ్యక్షురాలు డా. కోలవెన్ను మలయవాసిని గారు అధ్యక్షులుగాను, డా. వి. బాలమోహనదాస్ గారు ముఖ్య అతిథిగాను ఆచార్య మోహిని గారు ఆత్మీయ అతిథిగాను విచ్చేసారు.

ఆచార్య బాలమోహనదాస్ గారు, ఆచార్య మలయవాసిని గారు పుస్తకావిష్కరణ గావించి, ఆచర్య లీలావతి గారితో తమకు గల అనుబంధాన్ని సభకు తెలియజేసారు.

డా. చిట్టెళ్ల నిర్మలగారు పుస్తకాన్ని సమీక్షిస్తూ, అనువాద రచనలో సిద్ధహస్తులైన ఆచార్య లీలావతిగారి హిందీ అనువాదం, తెలుగు మూలానికి సరితూగేలా ఉందని అభివర్ణించారు.

సభకు విశాఖ సాహితీ కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం గారు స్వాగత వచనాలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here