[dropcap]శ్రీ[/dropcap]మతి దాసరి శివకుమారి వ్రాసిన రెండు పిల్లల పుస్తకాలను పరిచయం చేస్తున్నాం.
గౌరమ్మ గెలుపు:
బాలాల కథల్లో అధికంగా అబ్బాయిలు ప్రధాన పాత్రలలో ఉంటారు. అమ్మాయిలలో ధైర్యసాహసాలు, పట్టుదలలు అధికంగా ఉంటాయని నిరూపిస్తూ బాలికను ప్రధాన పాత్ర చేసిన రాసిన నవల ‘గౌరమ్మ గెలుపు’. ఇందులో ప్రధాన పాత్ర గౌరి. ఆమె ‘టిల్లూ’ అనే కుక్క సాయంతో దొంగల ఆట కట్టించి తన చెల్లిని విడిపించుకోవటం ఈ నవలిక కథ. బాలలను రంజింపజేస్తుందీ నవలిక.
కోతి – జామచెట్టు:
బాలలు చదివి, ఆనందించి, స్ఫూర్తిని పొందే 11 కథల సంపుటి ‘కోతి – జామచెట్టు’. ఇందులోని కథలకు బొమ్మలు వేసింది కూడా బాలలే కావడం విశేషం. ఈ పుస్తకంలో కథలకు బాలలు వేసిన బొమ్మలతో పాటు వారి వివరాలు పొందుపరచటం అభినందనీయం. ఇది బాలలకు ఉత్సాహాన్ని ఇచ్చి వారిలోని పఠానాసక్తిని, కళాసక్తిని పెంపొదిస్తుంది. నిజానికి ఇలాంటి ప్రయత్నాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సృజనాత్మక శక్తికి రెక్కల నివ్వాలని ప్రయత్నిస్తున్న రచయిత్రి, ప్రచురణకర్తలు అభినందనీయులు.
***
గౌరమ్మ గెలుపు
బాలల నవలిక,
రచన-దాసరి శివకుమారి,
పేజీలు 36.
కోతి – జామచెట్టు
బాలల కథల సంపుటి,
రచన-దాసరి శివకుమారి,
పేజీలు 84.
ప్రతులకు:
కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి
బోస్ రోడ్, తెనాలి 522201
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మొబైల్: 8247576323
దాసరి శివకుమారి,
301, సాకృత స్పెక్ట్రమ్,
రణవీర్ మార్గ్, సరళానగర్,
జె.యమ్.జె. కాలేజ్ దగ్గర,
తెనాలి 522202
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మొబైల్: 9866067664