ముద్రారాక్షసమ్ – చతుర్థాఙ్కః – 1

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

(తతః ప్రవిశ త్యధ్వగ వేషః పురుషః)

పురుషః

హీ హీమాణహే హీమాణ హే

శ్లోకం:

రాఅణిఓ ఓ మహిఓ! కో ణామ గఆగఅ మిహ క రేఇ,

అట్ఠాణ గమణ గువ్వీ పహుడో అణ్ణా జఇ ణహోఇ. (1)

జావ అమచ్చ రక్ఖసస్స ఏదం గేహం గచ్ఛామి. (శ్రాన్తవత్ పరిక్రమ్య) కో ఎత్థ దువారిఆణం? ణివే దేహ భట్టిణో అమచ్చ రక్ఖసస్స ఏసో కరభఓ తువరంతో పాటలీపుత్తఆదో ఆగదోత్తి.

[ఆశ్చర్య మాశ్చర్యమ్!

శ్లోకం:

రాజని యోగో మహీయాన్

కో నామ గతాగతమిహ కరోతి।

అస్థాన గమన గుర్వీ

ప్రభో రాజ్ఞా యది న భవతి?

యావదమాత్య రాక్షస స్యైత ద్గేహం గచ్ఛామి. కో ఽత్ర దౌవారికాణామ్? నివేదయ భర్తురమాత్యరాక్షసస్య, ఏష కరభక స్త్వరయన్ పాటలిపుత్రా దాగత ఇతి.]

అర్థం:

(తతః=అనంతరం, అధ్వగవేషః+పురుషః=బాటసారి వేషంలో ఉన్న వ్యక్తి,  ప్రవిశతి=ప్రవేశిస్తున్నాడు).

ఆశ్చర్యమ్+ఆశ్చర్యమ్=అంతా ఆశ్చర్యంగా ఉంది.

రాజ+నియోగః=ప్రభువు ఆజ్ఞ, మహీయాన్=తిరుగులేనిది (గొప్పది), అస్థాన+గమన+గుర్వీ=నిలబడడానికి లేకుండా నడవడం చేత చాలా పొడవుగా తోచే (మిక్కిలి దూరమనిపించే), ప్రభుః+ఆజ్ఞా=దేవర ఆదేశం, యది+న+భవతి=లేకపోయినట్లయితే, కః+నామ+ఇహ+ గతాగతం+కరోతి=ఎవడు ఇక్కడ(కు) రాకపోకలు సాగించగలడు?

యావత్+అమాత్యరాక్షసస్య+ఏతత్+గేహం+గచ్ఛామి=ఈ రాక్షసమంత్రి యొక్క ఇంటిని ఎంతలో చేరుకుంటాను! (శ్రాన్తవత్=అలసిపోయినవాడి మాదిరి, పరిక్రమ్య=ముందుకు నడిచి), కః+అత్ర దౌవారికాణామ్=ఎవరయ్యా ఇక్కడ దౌవారికులు (గుమ్మం కాపలాదారులు)?, భర్తుః+అమాత్యరాక్షసస్య=యజమాని రాక్షసమంత్రి గారికి, ఏషః+కరభకః=ఈ కరభకుడనేవాడు, త్వరయన్=తొందరపడుతూ, పాటలిపుత్రాత్+ఆగతః+ఇతి=పాటలీపుత్రం నుంచి వచ్చాడని, నివేదయ=విన్నవించు.

వ్యాఖ్య:

ఎవడైనా సరే, ప్రభువు ఆజ్ఞే లేకపోతే మధ్యలో ఎక్కడా నిలబడజాలని వేగంతో  ఇలాగ ఇంత దూరం రాకపోకలు సాగించగలడు? – అయ్యా, రాజాజ్ఞ అంతటి గొప్పది! – అనుకుంటున్నాడు కరభకుడు.

వృత్తం:

ఆర్య.

అలంకారం:

అప్రస్తుత ప్రశంస  (అప్రస్తుత ప్రశంసా స్యాత్ సాయత్ర ప్రస్తుతాశ్రయా – అని కువలయానందం).

దౌవారికః:

(ప్రవిశ్య) భద్ద, సణేహిం మన్తేహి, ఏసో అమచ్చో కజ్జ చింతా జణిదేణ జాఅరేణ సముప్పణ్ణ సీస వేఅణో అజ్జ వి సఅణం ణ ముంచది. తా చిట్ఠ ముహుత్తరం, లబ్ధావసరో తుహ ఆఅ మణం ణివేదేమి,

[భద్ర, శనై ర్మన్త్రయ, ఏషో ఽమాత్యః కార్యచిన్తా జనితేన జాగరేణ సముత్పన్న శీర్ష వేదనో ఽద్యాపి శయనం న ముఞ్చుతి, తస్మాత్తిష్ఠ ముహూర్తకమ్. లబ్ధావసర స్త వాగమనం నివేదయామి।]

అర్థం:

(ప్రవిశ్య=వచ్చి) భద్ర=నాయనా, శనైః+మన్త్రయ=మెల్లగా (గొంతు తగ్గించి) పిలవవయ్యా, ఏషః+అమాత్యః=ఈ మంత్రిగారు, కార్యచిన్తా+జనితేన=పని గురించే ఆలోచిస్తూండడం చేత పుట్టిన, జాగరేణ=నిద్రలేమితో, సముత్పన్న+ శీర్షవేదనః=తలనొప్పి పట్టుకున్నవాడై, అద్యాపి=ఇప్పటికీ, శయనం+న+ముఞ్చుతి=ఇంకా పక్క పై నుంచి లేవలేదు (మంచం దిగలేదు), తస్మాత్+ ముహూర్తకమ్+తిష్ఠ=అందువల్ల ఒక్క క్షణం కూర్చో. లబ్ధ+అవసరః=సమయం చూసి, తవ+అగమనం+నివేదయామి=నీ రాకను విన్నవిస్తాను.

పురుషః:

భద్దముహ తహ క రేహి. (భద్రముఖ, తథా కురు.)

అర్థం:

భద్రముఖ= నా తండ్రే (మంచివాడివి), తథా+కురు=అలాగే చెయ్యి.

(తతః ప్రవిశతి శయనగృహగత ఆసనస్థః శకటదా సేన సహ సచిన్తో రాక్షసః)

అర్థం:

(తతః=ఆ తరువాత, శయనగృహగత+ఆసనస్థః=పడకటింటిలో పీఠంపై కూర్చుని, శకటదాసేన+సహ=శకటదాసుతో కూడా, సచిన్తః+రాక్షసః+ప్రవిశతి=ఆలోచనతో ఉన్న ప్రవేశిస్తున్నాడు (ప్రవేశించి ఉన్నాడు).

రాక్షసః: 

(ఆత్మగతమ్)

శ్లోకం:

మమ విమృశతః కార్యారమ్భే విధేర విధేయతామ్,

అపి చ కుటిలాం కౌటిల్యస్య ప్రచిన్తయతో మతిమ్,

అథ చ విహితే మత్కృత్యానాం నికామ ముపగ్రహే,

కథ మిద మి హే త్యున్నిద్రస్య ప్రయా త్యనిశం నిశా॥ (2)

అర్థం:

(ఆత్మగతమ్=తనలో)

కార్య+ఆరమ్భే=పని మొదలుపెట్టడానికి ముందు, విధేః+అవిధేయతామ్=విధి అనుకూలించకపోవడం వల్లను, విమృశతః=గాఢంగా వితర్కిస్తూండడం వల్లను, అపి+చ=మరిన్ని, కౌటిల్యస్య+కుటిలాం+మతిమ్=చాణక్యుడి వక్రబుద్ధి గురించి,  ప్రచిన్తయతః=ఆలోచిస్తూండడం చేతను, అథ+చ=ఇంకా, మత్+కృత్యానాం=నా చర్యలకు, నికామం=అధికంగా, ఉపగ్రహే=అవాంతరం కలుగుతుండడం, విహితే=ప్రాప్తిస్తూండగా – ఇహ+ఇదం+కథం+ఇతి=ఇప్పుడిది ఎలాగ (గడిచేది!) అని, అనిశం=ఎల్లవేళలా, ఉన్నిద్రస్య+మమ=నిద్రలేమిచే బాధపడే నాకు, నిశా+ప్రయాతి=రాత్రి గడుస్తోంది.

వృత్తం:

హరిణి – న – స –  మ -ర – స – లగ – గణాలు.

అపి చ,

అపి+చ=అంతేకాకుండా,

శ్లోకం:

కార్యోపక్షేప మాదౌ తను మపి రచయం,

స్తస్య విస్తార మిచ్ఛన్ ,

బీజానాం గర్భితానాం ఫల మతి గహనం

గూఢ ముద్భేదయం శ్చ

కుర్వన్ బుద్ధ్యా విమర్శం, ప్రసృత మపి పునః

సంహరన్ కార్య జాతమ్,

కర్తా వా నాటకానా మిమ మనుభవతి

క్లేశ, మస్మద్విధోవా. (3)

అర్థం:

ఆదౌ=తొలుతగా, తనుం+అపి=సూక్ష్మంగా అయినా, కార్య+ఉపక్షేపం+రచయన్=తలపెట్టిన పనిని ప్రారంభిస్తూ, తస్య+విస్తారం=ఆ పని విస్తరించడం, ఇచ్ఛన్=కోరుతూ, గర్భితానాం+బీజానాం+అతిగహనం+ఫలం=గూఢంగా నిండి వున్న క్లిష్టమైన ఫలితాన్ని, గూఢం+ఉద్భేదయన్+చ=రహస్యంగా వెల్లడి చేస్తూ, బుద్ధ్యా+ విమర్శన్+కుర్వన్=ఆలోచన ద్వారా బేరీజు వేసుకొంటూ,పునః=అంతలోనే, ప్రసృతం+అపి+కార్యజాతమ్=అటు ఇటుగా వ్యాపించే పనుల సముదయాన్ని, సంహరన్=కూడదీసుకుంటూ, – నాటకానాం+కర్తా+వా=నాటక రచయిత గాని, అస్మత్+విధః+వా=నాలాంటివాడు గాని, క్లేశం+అనుభవతి=కష్టపడుతూంటాడు.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

శ్లేషానుప్రాణిత దీపకాలంకారం (వదంతి వర్ణ్యా వర్ణ్యానాం ధర్మైక్యం దీపకం బుధాః – అని కువలయానందం).

ఇక్కడ  నాటక రచయిత ‘రచనా’ ప్రయత్నానికీ, రాక్షసమంత్రి రాజకీయ వ్యూహ ‘రచనా’ ప్రయత్నానికీ శ్లేషపూర్వకంగా స్వభావ వివరణ గమనించదగినది.

వ్యాఖ్య:

ఈ శ్లోకంలో నాటక రచనకు సంబంధించిన పరిభాషలను పొందుపరిచాడు రచయిత. నాటక రచనలో రచయిత బీజవిస్తృతి, ప్రాతికూల్య ఉపసంహారాదులను – ముఖ, ప్రతిముఖ, గర్భ, విమర్శ, నిర్వహణ సంధులనే పంచ సంధుల ద్వారా తన ఇతివృత్తాన్ని విస్తరించి చెప్పడం కోసం చాలా శ్రమ పడవలసి వచ్చినట్టే – రాజకీయ  వ్యూహ ‘రచన’లో కూడా – ఇట్టి నిర్వహణ రాక్షసమంత్రి లాంటి వారికి కష్టతరంగా పరిణమిస్తుందని – ఇక్కడ అర్థ వివరణ అవసరమైంది.

రాక్షసః:

త దపి నామ దురాత్మా చాణక్యవటుః 

అర్థం:

తత్+అపి+నామ+దురాత్మా+చాణక్యవటుః= (కొంపదీసి) ఆ దుర్మార్గుడు చాణక్య పిల్లగాడు గాని…

దౌవారికః:

(ఉపసృత్య) జేదు. (జయతు)

అర్థం:

(ఉపసృత్య=సమీపించి) జయతు= (అయ్యవారు) జయించుగాక…

రాక్షసః:

అతిసన్ధాతుం శక్యః స్యాత్?  

అర్థం:

అతిసన్ధాతుం=నమ్మించడానికి, శక్యః+స్యాత్=వీలవుతుందా (సాధ్యమేనా)?

దౌవారికః:

అమచ్ఛో. (అమాత్య)

అర్థం:

అమాత్య=మంత్రివర్యా!

రాక్షసః:

(వామాక్షిస్పన్దనం సూచయిత్వా ఆత్మగతమ్)

దురాత్మా చాణక్యవటు ర్జయ, త్వతి సన్ధాతుం శక్యః స్యాదమాత్యఇతి వాగీశ్వరీ వామాక్షిస్పన్దనేన ప్రస్తావగతా ప్రతిపాదయతి. తథాపి నోద్యమ స్త్యాజ్యః. (ప్రకాశమ్) భద్ర! కి మసి వ క్తుకామః?  

అర్థం:

(వామాక్షిస్పన్దనం=ఎడమకన్ను అదరడాన్ని, సూచయిత్వా=సూచించి, ఆత్మగతమ్=తనలో)

“దురాత్మా+చాణక్యవటుః+జయతు+ఇతి=దుర్మార్గుడు చాణక్యపిల్లగాడు జయిస్తాడు గాక – అని,  అతిసన్ధాతుం=వంచించబడడానికి, అమాత్యః+శక్యః+ స్యాత్= మంత్రి సమర్థుడు కాగలడు (ఆ మాటతో మంత్రికి మోసం జరుగుతుంది). ఇతి=అని, వాగీశ్వరీ=వాగ్దేవి, వామాక్షిస్పన్దనేన=ఎడమకన్ను అదరడం ద్వారా, ప్రస్తావగతా=ప్రస్తావించడం ద్వారా, ప్రతిపాదయతి=తెలియజేస్తోంది (సూచిస్తోంది). తథా+అపి=అయినప్పటికీ, నః+ఉద్యమః+త్యాజ్యః=మా ప్రయత్నం విడిచిపెట్టరాదు. (ప్రకాశమ్=పైకి) భద్ర=నాయనా, కిమ్+వక్తుకామః+అసి=ఏమి చెప్పాలనుకుంటున్నావు?

దౌవారికః:

అమచ్చ కరభఓ దుఆరే చిట్ఠది. (అమాత్య, కరభకో ద్వారి తిష్ఠతి.)

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, కరభకః=కరభకుడు, ద్వారి+తిష్ఠతి=గుమ్మంలో ఉన్నాడు.

రాక్షసః:

శీఘ్రం ప్రవేశయ  

అర్థం:

శీఘ్రం+ప్రవేశయ=వెంటనే ప్రవేశపెట్టు.

దౌవారికః:

తహ (తథా) – (ఇతి నిష్క్రమ్య పురుష ముపసృత్య) భద్ద, ఉపసప్ప అమచ్చం. (భద్ర ఉపసర్ప అమాత్యమ్).

అర్థం:

తథా=అలాగే, – (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పురుషం+ఉపసృత్య= వ్యక్తిని సమీపించి) భద్ర=నాయనా, అమాత్యమ్+ఉపసర్ప=మంత్రిగారి దగ్గరకు వెళ్ళు.

కరభకః:

(ఉపసృత్య) జేదు అమచ్చో. (జయత్వమాత్యః).

అర్థం:

(ఉపసృత్య=సమీపించి), అమాత్య+జయతు=మంత్రివారు జయం పొందుదురుగాక.

రాక్షసః:

భద్ర. ఉపవిశ.  

అర్థం:

భద్ర=నాయనా, ఉపవిశ=కూర్చో.

కరభకః:

జం అమచ్చో ఆణ వేది. (యదమమాత్య ఆజ్ఞాపయతి)

(ఇతి భూమావుపవిష్టః.)

అర్థం:

యత్+అమాత్యః+ఆజ్ఞాపయతి=మంత్రివారు ఆదేశించినట్టే… (ఇతి=అని, భూమౌః+ఉపవిష్టః=నేల మీద కూర్చున్నాడు).

రాక్షసః:

(ఆత్మగతమ్) కస్మిన్ ప్రయోజనే మ మాయం ప్రహితః ఇతి ప్రయోజనానాం బహుత్వా న్నఖ ల్వవధారయామి.

(ఇతి చిన్తాం నాటయతి.)  

అర్థం:

(ఆత్మగతమ్=తనలో) కస్మిన్+ప్రయోజనే+మమ+అయం+ప్రహితః=నాకు ఏ పని కోసం ఇతడిని పంపడం జరిగింది?, ఇతి=అని, ప్రయోజనానాం+బహుత్వాత్=అనేక పనుల కారణంగా, న+అవధారయామి+ఖలు=జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను కద!.

(ఇతి=అని, చిన్తాం+నాటయతి=ఆలోచనను సూచిస్తున్నాడు.)

(తతః ప్రవిశతి వేత్రపాణి ద్వితీయః పురుషః)

(తతః=అంతలో, వేత్రపాణి+ద్వితీయః+పురుషః+ప్రవిశతి=బెత్తం ధరించిన రెండవ వ్యక్తి వచ్చాడు)

పురుషః:

ఓసలేహ ఓసలేహ. ఆఅదో, అవేహ అవేహ మాణవా, కిం ణ పేక్ఖహ?

(అవసరత అపసరత. ఆగతః – అపేత అవేత మానవాః. కిం న పశ్యథ?)

అర్థం:

అవసరత+అపసరత=తప్పుకోండి, తప్పుకోండి. ఆగతః=వచ్చాడు, అపేత+అపేత=వెళ్ళండి, వెళ్ళండి, మానవాః=మనుషులూ!. కిం+న+పశ్యథ=ఏం? కనబడదా?

శ్లోకం:

దూలే పత్తాసత్తీ, దంసణం వి దుల్లహ మధణ్ణై

కల్లాణ కులహరాణం దేఆణం విఅ మణుస్స దేఆణం.

(దూరే ప్రత్యాసత్తి, ర్దర్శన మపి దుర్లభ మధన్యైః

కల్యాణకులధరాణాం దేవానా మివ మనుష్య దేవానామ్.) (4)

అర్థం:

కల్యాణ+కులధరాణాం=శుభకర పర్వతమైన మేరువు పైనుండే, దేవానాం+ఇవ=దేవతల మాదిరి, మనుష్య+దేవానామ్=మనుషులలో దేవతల వంటి రాజుల (యొక్క), ప్రత్యాసతిః=సామీప్యం (దగ్గరితనం), దూరే=దూరపు సంగతి (అలభ్యం). అధన్యైః=దురదృష్టవంతుల వల్ల (చేత), దర్శనం+అపి=చూసే భాగ్యం, దుర్లభమ్=సాధ్యపడదు.

వృత్తం:

ఆర్య.

అలంకారం:

‘దేవానం ఇవ’ – అనడం వల్ల ఉపమ.

కల్యాణ కులధరాణాం – ఉన్నత కులంలో పుట్టిన/మేరువుపై నివసించే – అనే రెండర్థాల కారణంగా శ్లేష.

(ఆకాశే)

అజ్జా కిం భణాహ – కిం ణిమి త్తం ఓసాలణం కరిఅ దిత్తి. అజ్జా, ఏసోక్ఖు కుమాలో మలఅకేదు సముప్పణ్ణసీసవే అణం అమచ్చ రక్ఖసం పేక్ఖిదుం ఇదో ఏవ అఅచ్ఛది. తా ఓసాలణా కరీఅది.

(ఆర్యాః, కిం భణథ, కిం నిమిత్త మపసారణా క్రియతే ఇతి. ఆర్యాః, ఏష ఖలు కుమారో మలయకేతుః సముత్పన్న శీర్ష వేదన మమాత్య రాక్షసం ప్రేక్షితు మిత ఏ వాగచ్ఛతి. తస్మా దవసారణా క్రియతే.)

ఆర్యాః=అయ్యలారా, కిం+భణథ=ఏమంటున్నారు?, అపసారణా+కిం నిమిత్తమ్+ క్రియతే+ఇతి=తొలగమనడం ఎందుకు జరుగుతోందనా? ఆర్యాః=అయ్యలూ, ఏష+ఖలు+కుమారః+మలయకేతుః=ఈ మలయకేతు రాకుమారుడు, సముత్పన్న+శీర్షవేదనం+అమాత్యరాక్షసం=తలనొప్పి వచ్చి బాధపడుతున్న రాక్షసమంత్రిని, ప్రేక్షితుం=సందర్శించడానికి, ఇతః+ఏవ+ఆగచ్ఛతి=ఇక్కడికే వస్తున్నారు కదా!. తస్మాత్=అందువల్ల, అవసారణా+క్రియతే=(జనాన్ని) తొలగించడం జరుగుతోంది.

(ఇతి నిష్క్రాన్తః పురుషః)

(ఇతి=అని, పురుషః=(బెత్తం ధరించిన) వ్యక్తి, నిష్క్రాన్తః=వెళ్ళిపోయాడు)

(తతః ప్రవిశతి భాగురాయణేన కఞ్చుకినా చానుగమ్యమానో మలయ కేతుః)

భాగురాయణేన+కఞ్చుకినా+చ+అనుగమ్యమానః=భాగురాయణుడూ, కఞ్చుకీ వెంటనంటి రాగా, తతః=అంతట, మలయకేతుః+ప్రవిశతి=మలయకేతువు వచ్చాడు).

మలయ:

(నిశ్వ స్యాత్మగతమ్) అద్య దశమో మాస స్తాత స్యోపరతస్య, న చాస్మాభి ర్వృథా పురుషాభిమాన ముద్వ హద్భిస్త ముద్దిశ్య తోయాఞ్జలి రప్యావర్జితః. ప్రతిజ్ఞాత మేత త్పురస్తాత్.

అర్థం:

(నిశ్వస్య+ఆత్మగతమ్=నిట్టూర్చి – తనలో),  ఉపరతస్య+తాతస్య=గతించిపోయిన తండ్రిగారికి, అద్య+దశమః+మాసః=ఇవాళ పదవ నెల. (ఆయన గతించి పదినెలలు గడిచాయి), సః+చ=అతడికి సైతం, వృథాపురుషాభిమానం+ఉద్వహద్భిః+అస్మాభి=నిష్ప్రయోజనమైన మగతనం వహించే మేము (మా చేత), తం+ఉద్దిశ్య=అతడి నిమిత్తం, తోయాఞ్జలి+అపి=(నువ్వుల) నీరు విడవడం కూడా, న+ఆవర్జితః=విడువలేదు (విడువబడలేదు). పురస్తాత్=వెనుక, ఏతత్+ప్రతిజ్ఞాతమ్=ఇలాగ (ఇది) ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

శ్లోకం:

వక్ష స్తాడన భిన్న రత్నవలయం

భ్రష్టోత్తరీ యాంశుకం

హా హేత్యుచ్చరి తార్తనాద కరుణం

భూరేణురూక్షాలకమ్

తాదృ ఙ్మాతృజనస్య శోక జనితం

సంప్ర త్యవస్థాన్తరం

శత్రు స్త్రీషు మయా విధాయ గురవే

దేయో నివాపాఞ్జలిః (5)

అర్థం:

వక్షస్తాడన+భిన్న+రత్నవలయం=గుండెలు బాదుకొనడం వల్ల పగిలిన రతనపు గాజులు కలదీ, భ్రష్ట+ఉత్తరీయ+అంశుకం=భుజం మీద నుంచి జారిపడే పైటకొంగు కలదీ, హా+హా+ఇతి+ఉచ్చరిత+ఆర్త+కరుణం=అయ్యో, అయ్యో అంటూ దయనీయంగా పలికే, పరిస్థితిలో జాలిగొలిపేదిగా ఉన్నదీ, భూ+రేణు+రూక్ష+అలకమ్=(నేలపై దొర్లిన కారణంగా) మట్టిరేణువులు అంటుకొనడం వల్ల గరుకు దేలిన ముంగురులు కలదీ, – (అయిన), తాదృక్+మాతృజనస్య=అట్టి తల్లుల (యొక్క), శోక+జనితం=దుఃఖం నుంచి పుట్టిన, సంప్రతి+అవస్థాన్తరం=ఇప్పటి దుర్దశను, శత్రుస్త్రీషు+విధాయ=శత్రువుల స్త్రీల విషయంలో కలుగజేసి, గురవే=తండ్రికి, మయా = నా చేత, నివాప+అఞ్జలిః=తిలాంజలి, దేయః=ఇవ్వదగినది (‘నేను ఇవ్వాలి’ అని ప్రతిజ్ఞ).

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

పర్యాయోక్తి (పర్యాయోయది పర్యాయేణైకస్య అనేక సంశ్రయః – అని కువలయానందం). ఇక్కడ మాతృజనం యొక్క భిన్న దుఃఖాంశాలను ఒకటి వెంట ఒకటిగా చెప్పడం గమనించదగినది – దుఃఖ స్థితిలో ఉండే స్త్రీల వివశత్వాన్ని సహజంగా వర్ణించినందువల్ల స్వభావోక్తి కూడా  (స్వభావోక్తిస్స్వభావస్య జాత్యాదిస్థస్య వర్ణనమ్- అని కువలయానందం).

వ్యాఖ్య:

మలయకేతువు తన తండ్రికి నివాపాంజలి గురించి ప్రస్తావించడం చూస్తే అతడు మ్లేచ్ఛుడు కాదనవలసి వస్తోందని వ్యాఖ్యాత్రయకర్త ఎస్.సి. చక్రవర్తి.

మలయ:

కి మత్ర బహునా ?

అర్థం:

కిమ్+అత్ర+బహునా=ఇన్ని మాటలెందుకు (అంతెందుకు?)

శ్లోకం:

ఉద్యచ్ఛతా ధుర మకాపురుషానురూపాం

గన్తవ్య మాజినిధ నేన పితుః పథా వా

ఆచ్ఛిద్య వా స్వజననీజన లోచనేభ్యో

నేయో మయా రిపువధూనయనాని బాష్పః (6)

అర్థం:

అకాపురుష+అనురూపాం=ఉత్తముడైన వ్యక్తిని తగిన, ధురం=(రాజ్య)భారాన్ని, ఉద్యచ్ఛతా=వహిస్తూ, ఆజి+నిధనేన=యుద్ధంలో మరణించడమనే, పితుః+పథా=తండ్రిగారి దారిని, వా(గన్తవ్యమ్)=వెళ్లదగును. వా=లేదా, స్వ+జననీ+లోచనేభ్యః=నా తల్లుల కన్నుల నుంచి, బాష్పః+ఆచ్ఛిద్య=కన్నీటిని తీసివేసి, మయా=నా చేత, రిపువధూ+నయనాని=శత్రుభార్యల కళ్ళను (కళ్ళలోనికి), నేయః=తీసుకువెళ్ళగలను.

వృత్తం:

వసంత తిలకం – త- భ – జ – జ – గ గ – గణాలు.

వ్యాఖ్య:

చంద్రకేతువు వేదన ఇక్కడ గమనించాలి. రాజ్యభారం వహిస్తూ మగతనం ప్రదర్శించి యుద్ధంలో మరణించినా మరణించాలి; లేదా నా తల్లులు పడే వేదనను, శత్రుభార్యలకు సంక్రమింపనన్నా చేయాలి. చెయ్యకపోతినే – అని చింత.

ఇక్కడ- ‘ఆజి నిధనేన పితుః పథా వా’ అని మలయకేతువు భావించడం తగిన విధంగా తోచదు. పర్వతరాజు నిజానికి యుద్ధంలో మరణించలేదు. విషకన్యా సంపర్కం వల్ల – స్త్రీ వ్యసనం వల్ల – మరణించాడు కద! అయితే ఒక సమర్థనకు అవకాశం లేకపోలేదు. యుద్ధం అంటే అక్షరాలా యుద్ధరంగంలో జరిగే శస్త్ర యుద్ధమే కానక్కరలేదు; శత్రువుల మధ్య పరస్పరం నడిచే ఎత్తు పై ఎత్తులు కూడా యుద్ధంలో భాగమే! – ఇవ్వవలసిన అర్ధరాజ్యం ఇవ్వకుండా, విషకన్యాప్రయోగం అనే యుద్ధాన్ని చాణక్యుడు ప్రయోగించగా, పర్వతరాజు మరణం ఒక విధంగా యుద్ధరంగంలో నిధనమే!

మలయ:

(ప్రకాశమ్) ఆర్య జాజలే, ఉచ్యన్తా మస్మద్వచనా దనుయాయినో రాజానః – ఏక ఏ వాహ మమాత్య రాక్షస స్యాతర్కితగమ నేన ప్రీతి ముత్పాదయితు మిచ్ఛామి. త త్కృత మనుగమన క్లేశేవఇతి.

అర్థం:

(ప్రకాశమ్=పైకి), ఆర్య జాజలే=జాజలయ్యా, – అనుయాయినః+రాజానః=నన్ను వెన్నంటి వచ్చే రాజులు (లకు), అస్మత్+వచనాత్=నా మాటగా, ఉచ్యన్తాం=చెప్పడం జరగాలి గాక! (ఏమనీ?)  -“అమాత్యరాక్షసస్య=రాక్షసమంత్రికి, అతర్కిత+గమనేన=ముందు ఊహించని విధంగా వెళ్ళడం ద్వారా, ప్రీతిం+ఉత్పాదయితుం=సంతోషం కలిగించే ఉద్దేశంతో, అహం+ఏక+ఏవ+గచ్ఛామి=నేనొక్కడినే వెడుతున్నాను, తత్+అనుగమనక్లేశేన+కృతం(అలం)=అందువల్ల నన్ను అనుసరించే శ్రమ (తీసుకోవద్దు) – ఇతి=అని.

కఞ్చుకీ:

తథా. (ఇతి పరిక్రమ్యాకాశే) భో భో రాజానః, కుమారః సమాజ్ఞాపయతి – న ఖ ల్వహం కేనచి దనుగన్తవ్యఃఇతి. (విలోక్య సహర్షం) కుమార స్యాజ్ఞాన న్తర మేవ సర్వే రాజానః ప్రతినివృత్తాః. పశ్యతు కుమారః.

అర్థం:

తథా=అలాగే. (ఇతి+పరిక్రమ్య=అని – ముందుకు నడచి, ఆకాశే=ఆకాశంలో దృష్టి నిలిపి), భోభో రాజానః=అయ్యా, రాచవారూ, కుమారః+సమాజ్ఞాపయతి=(మలయకేతు) రాకుమారుడు నిర్దేశిస్తున్నాడు – ‘అహం+న+ఖలు+కేనచిత్+అనుగన్తవ్యః=నా వెంట ఎవరు రావద్దు (నేను ఎవరి చేతను కూడా అనుసరింపబడరాదు)’. ఇతి=అని – (విలోక్య=చూసి, సహర్షం=సంతోషంగా), కుమారస్య+ఆజ్ఞా+అనన్తరం+ఏవ=రాకుమారుడు ఆదేశించిన మాత్రం చేతనే, సర్వే+రాజానః=రాజులందరూ, ప్రతినివృత్తాః=వెనుదిరిగారు. పశ్యతు+కుమారః=రాకుమారుడు చూడవచ్చు (ఎదుట జరుగుతున్న సందడిని చూడవచ్చు).

శ్లోకం:

సోత్సేధైః స్కన్దదేశైః ఖరతర కవికా

కర్ష ణాత్యర్థ భుగ్నై

రశ్వాః కై శ్చి న్నిరుద్ధాః, ఖ మివ ఖురపుటైః

ఖణ్డయన్తః పురస్తాత్;

కేచి న్మాతఙ్గముఖ్యై ర్విహత జవతయా

మూక ఘంటైర్నివృత్తా;

మర్యాదాం భూమిపాలా జలధయ ఇవ తే

దేవ, నోల్లఙ్ఘ యన్తి. (7)

అర్థం:

ఖరతర+కవికా+కర్షణా+అత్యర్థ+భుగ్నైః=(కొరకడానికి సాధ్యం కానంత) గట్టి కళ్ళేలను లాగడం కారణంగా, అధిక వక్రంగా వంగడం వల్ల, స+ఉత్సేధైః=చాలా ఎత్తైన, స్కన్దదేశైః=మెడలతో, పురస్తాత్=ఎట్టఎదుటి, ఖమ్=ఆకాశాన్ని, ఖురపుటైః=గిట్టల అడుగుభాగాలతో (గిట్టడిప్పలతో), ఖణ్డయన్తః+ఇవ=తెగ కోస్తున్న మాదిరిగా తోచే, అశ్వాః=గుఱ్ఱాలు, కైఃచిత్=కొంతమంది (చేత) (రౌతులు), నిరుద్ధాః=లాగిపట్టి ఉన్నారు (పట్టి ఉంచబడ్డాయి), కేచిత్=మరికొందరైతే, విహత+జవతయా=వేగాన్ని నిలువరించడం వల్ల, మూక+ఘంటై=మెడగంటల ధ్వని అణగిపోయిన, మాతఙ్గ+ముఖ్యై=శ్రేష్ఠమైన ఏనుగులతో, నివృత్తాః=వెనుదిరిగారు, దేవ=దేవరా!భూమిపాలాః=పరిపాలకులైన రాజులు, జలధయ+ఇవ=సముద్రాల మాదిరి, తే+మర్యాదాం=వారి వారి హద్దును, న+ఉల్లఙ్ఘయన్తి=దాటలేదు.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

స్వభావోక్తి (స్వభావోక్తిస్స్వభావస్య జాత్యాదిస్థస్య వర్ణనమ్- అని కువలయానందం).

“భూమిపాలాః మర్యాదం జలధయః ఇవ న ఉల్లంఘయన్తి” – అనే చోట ఉపమ. శ్లేషతో సంసృష్టి.

వ్యాఖ్య:

మలయకేతువు తన సమర్థకులై వెంట తోడుగా వస్తున్న రాజుల్ని ఆగిపొమ్మని జాజలి ద్వారా వర్తమానించగానే – హఠాత్తుగా తమ తమ వాహనాలను నిరోధించవలసి వచ్చింది. వేగంగా కదిలే గుఱ్ఱాల కళ్ళేలను లాగిపెట్టి ఆపడం వల్ల, అవి నిలువరించుకోడానికి గిట్టల్ని నేలలోకి గుచ్చి, కోరాడవలసివచ్చింది. అలాగే ఏనుగుల్ని నిలువరించడం వల్ల మెడల గంటల చప్పుళ్ళు నిలిచిపోయాయి – ఈ విధంగా – ఆయా రాజులు, చంద్రకేతువు ఆదేశాన్ని అతిక్రమించకుండా – సముద్రాలు చెలియలికట్టను దాటక నిలిచిపోయే మాదిరి నిలిచిపోయారు. ఈ యాత్రాదృశ్యం అత్యంత సహజంగా వర్ణించడం వల్ల స్వభావోక్త్యలంకారం గమనించవచ్చు.

మలయ:

ఆర్య, త్వ మపి సపరిజనో నివర్తస్వ. భాగురాయణ ఏకో మా మనుగచ్చతు।

అర్థం:

ఆర్య=అయ్యా, త్వమ్+అపి=నువ్వు కూడా, స+పరిజనః=నీ పనివారితో సహా, నివర్తస్వ=వెనుదిరిగిపో. ఏకః+భాగురాయణః=భాగురాయణుడొక్కడే, మామ్=నన్ను, అనుగచ్ఛతు=అనుసరించు గాక!

కఞ్చుకీ:

తథా. (ఇతి సపరిజనో నిష్క్రాన్తః).

అర్థం:

తథా=అలాగే. (ఇతి=అని, స+పరిజనః=తన పనివారితో, నిష్క్రాన్తః=వెళ్ళిపోయాడు)

మలయ:

సఖే, భాగురాయణ, విజ్ఞప్తో ఽహమి హాగచ్ఛద్బి ర్భద్రభట ప్రభృతిభిః యథా న వయ మమాత్య రాక్షసద్వారేణ కుమార మాశ్రయణీయ మాశ్రయామహే, కిన్తు, కుమారస్య సేనాపతిం శిఖరక మురీకృత్య దుష్టామాత్య పరిగృహీతా చ్చన్ద్రగుప్తా దపరక్తాః కుమార మాభిరామిక గుణయోగా దాశ్రయణీయ మాశ్రయామహే.ఇతి త న్న మయా సుచిరమపి విచారయతా తేషా మయం వాక్యార్థో ఽపధారితః

అర్థం:

సఖే+భాగురాయణ=మిత్రమా! భాగురాయణా!, ఇహ+ఆగచ్ఛద్భిః+రుద్రభటప్రభృతిభిః=ఇక్కడకు వస్తున్న రుద్రభటుడు మొదలైనవారు (వారి చేత), అహం+విజ్ఞప్తః=నాకు విజ్ఞాపన చేశారు, యథా=ఎలాగంటే – ‘వయం=మేము, అమాత్య రాక్షస+ద్వారేణ=రాక్షసమంత్రి ద్వారా, ఆశ్రయణీయం+కుమారం=ఆశ్రయించదగిన మలయకేతు రాకుమారుణ్ణి, న+ఆశ్రయామహే=ఆశ్రయం కోరబోము, కిన్తు=మరి (ఎవరి ద్వారానంటే), కుమారస్య+సేనాపతిం+శిఖరకం=రాకుమారుడి సేనాపతి అయిన శిఖరకుడిని, ఉరీకృత్య=ఒప్పజేసి, దుష్ట+అమాత్య+పరిగృహీతాత్+చన్ద్రగుప్తాత్=చెడ్డవాడైన చాణక్య మంత్రి చేత స్వీకరించబడిన చంద్రగుప్తుని వల్ల, అపరక్తాః=అనాదరణకు గురైన (మేము), అభిరామిక+గుణయోగాత్=ప్రశంసనీయ (మనోహర) గుణాల కలిమి వల్ల, ఆశ్రయణీయం=ఆశ్రయింపదగిన (రాకుమారుడిని), ఆశ్రయామహే=ఆశ్రయిస్తాము.’ ఇతి=అని, తత్=ఆ విషయం, సుచిరం+అపి+విచారయతా+మయా=చాలా (దీర్ఘంగా) ఆలోచించబడినప్పటికీ నాకు (నా చేత), తేషాం+అయం+వాక్యార్థః=వారి ఈ మాటల అంతరార్థం, న+అపధారితః=అర్థం కాలేదు (కాబడలేదు).

భాగు:

కుమార, న దుర్బోధో ఽయ మర్థః। విజిగీషు మాత్మగుణసంపన్నం ప్రియహిత ద్వారే ణాశ్రయణీయ మాశ్రయే దితి నను న్యాయ్య ఏ వాయ మర్థః।

అర్థం:

కుమార=రాకుమారా!, అయం+అర్థః+న+దుర్బోధః=ఇందులో అర్థం కాకపోవడానికేమీలేదు. విజిగీషుం+ఆత్మగుణసంపన్నం=జయశీలుడూ, గొప్ప గుణాలు కలవాడు అయిన వ్యక్తిని,  ప్రియ+హిత+ద్వారేణ=ఆప్తులు, ఇష్టులు ద్వారా, ఆశ్రయణీయం+ఆశ్రయేత్=ఆశ్రయించదగినవారిని ఆశ్రయించాలి, ఇతి=అనే, న్యాయ్యం+ఏవ=ధర్మాన్నే ఆశ్రయించాలి కదా – అనేదే, అయం+అర్థః=ఇక్కడ అంతరార్థం.

మలయ:

సఖే భాగురాయణ, న న్వమాత్య రాక్షసో ఽస్మాకం ప్రియతమో హితతమశ్చ.

అర్థం:

సఖే+భాగురాయణ=మిత్రమా! భాగురాయణా!, అమాత్యరాక్షసః=రాక్షసమంత్రి, అస్మాకం=మనకు, ప్రియతమః+హితతమః+చ+నను=అత్యంత ఆత్మీయుడు, మన క్షేమం కోరేవాడు కూడా కద!

భాగు: 

ఏవ మేతత్। కి న్త్వమాత్య రాక్షస శ్చాణక్యే బద్ధ వైరో, న చన్ద్రగుప్తే। త ద్యది కదాచి చ్చాణక్య మతిజిత కాశిన మసహమానః స సాచివ్యా దపరోపయేత్తతో నన్ద కులభక్త్యా నన్దాన్వయ ఏ వాయ మితి సు హృజ్జనాపేక్షయా చామాత్య రాక్షస శ్చన్ద్రగుప్తేన సహ సన్దధీత। చన్ద్రగుప్తో ఽపి పితృపర్యాయాగత ఏవాయ మితి సన్ధి మనుమన్యత। ఏవం స త్యస్మాసు కుమారో న విశ్వసే దిత్యయ మేషాం వాక్యార్థః।

అర్థం:

ఏవం+ఏతత్=అది అంతే! (అది నిజమే). కిం+తు=కాని – అమాత్య రాక్షసః=రాక్షసమంత్రి, చాణక్యే+బద్ధవైరః=చాణక్యుని పట్ల శత్రుత్వం కలవాడు. చన్ద్రగుప్తే+న=చంద్రగుప్తుని యందు కాదు. తత్=అందువల్ల, అతిజితకాశినం+చాణక్యం=గెలుపుతో గర్వించి ఉన్న చాణక్యుణ్ణి, అసహమనః=సహించజాలనివాడై, కదాచిత్+సాచివ్యాత్+అపరోపయేత్=ఎప్పుడైనా మంత్రి పదవి నుంచి దించేస్తే, తతః=ఆ మీద, నన్దకుల+భక్త్యా=నందకులం పట్ల తనకున్న భక్తి కారణంగా, అయం+నన్దాన్వయం+ఏవ=ఈ చంద్రగుప్తుడు కూడా నందవంశం వాడే కదా, ఇతి=అని, – సుహృత్+జన+అపేక్షయా=స్నేహభావం చేత, చ=కూడ, అమాత్యరాక్షసః=రాక్షసమంత్రి, చన్ద్రగుప్తేన+సహ=చంద్రగుప్తునితో, సన్దధీత=సంధి చేసుకోవచ్చును. చన్ద్రగుప్తః+అపి=చంద్రగుప్తుడు కూడ, అయం+పితృపర్యాయ+ఆగతః+ఏవ+ఇతి=తండ్రివంటి వాడే కదా అని, సంధిం+అనుమన్యత=సంధికి అనుమతిస్తాడు. ఏవం+సతి=ఇలాగ జరిగితే (ఇలాగుండగా), కుమారః+అస్మాసు+న+విశ్వసేత్=మలయకేతు రాకుమారుడు మాకు నమ్మదగినవాడు కాదు – ఇతి =అని, అయం+ఏషాం+వాక్యార్థః=వారి యా మాటల అంతరార్థం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here