ప్రాచీన ఆటలు – సైన్స్ – బొంగరం ఆట

0
3

[box type=’note’ fontsize=’16’] సాంప్రదాయక, ప్రాచీనమైన బొంగరం ఆటలోని సైన్స్ సూత్రాలను కథ రూపంలో బాలలకి వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]ద[/dropcap]సరా సెలవులు ఎక్కువ రోజులు ఇవ్వటంతో పిల్లల్ని వరంగల్ లోని తాతా నానమ్మాల దగ్గరకు పంపారు. వరుణ్, కిరణ్, స్వాతి, నిత్య చురుకైన పిల్లలు.

ఒకరోజు వాళ్ళందరూ కిచన్‌లో లడ్డులు చేస్తున్న నానమ్మా నళిని దగ్గరకు వచ్చారు. వాళ్ళు తెచ్చుకున్న గేమ్స్, బుక్స్ విసుగు పుట్టాయి.

పిల్లల్ని చూసిన నానమ్మాకి విషయం అర్థం అయింది వాళ్లకి బోర్ కొడుతున్నదని.

“హలో! పిల్లలు! లడ్డు కావాలా నాయనా?” అన్నారు.

“లడ్డు వద్దుగాని నానమ్మా! ఒక్క విషయం చెప్పు” అన్నాడు వరుణ్

“ఏంటా సంగతి?”

“నానమ్మా! నువ్వు చిన్నగా ఉన్నప్పుడు… మా ఏజ్‌లో.. వాట్ గేమ్స్ యు ప్లేయ్డ్? ఏమి ఆటలు ఆడావు?” అన్నాడు కిరణ్

చేస్తున్న పని ఆపిన నానమ్మా “ఆ! వెయిట్! లెట్ మీ థింక్. సారీ గుర్తు తెచ్చుకోనివ్వండి. మేము ఫ్రెండ్స్‌తో 5 స్టోన్స్, చింతపిక్కలు, కుందుళ్ళు, నేలా బండా ఆడేవాళ్ళము.”

“వాట్? చింత పిక్కలు? వాట్స్ దట్?” అంది ఆశ్చర్యంగా స్వాతి.

“5 స్టోన్స్, నేలా బండా వాట్ అర్ దే?” అంది నిత్య వింతగా.

“నానమ్మా! నువ్వు చెప్పేవి ఆటలా? స్ట్రేంజ్” అన్నారు కోరస్‌గా పిల్లలు.

ఇంతలో పిల్లల్ని వెతుకుతూ వచ్చిన తాతకి సంగతి అర్థం అయింది.

“హే! మీరంతా ఇక్కడ ఉన్నారా? వావ్ లడ్డు! మై ఫేవరేట్” అంటూ తీసుకుని తిన్నారు.

“నళిని! పిల్లలకి పెట్టు.”

లడ్డు తింటున్న పిల్లలని తీసుకుని హాల్ లోకి వచ్చారు.

“తాతా! నానమ్మా చైల్డ్ హుడ్ గేమ్స్ చెబుతున్నారు. మేము వినాలి.”

“ఉండండి. నేను చింత పిక్కల కన్నా మంచి ఆట చూపిస్తాను.”

“గుడ్ గేమ్?” అన్నారు పిల్లలు

“యా! వెరీ ఇంట్రెస్టింగ్ అల్సొ. రండి” అంటూ పిల్లల్ని తన రూమ్ లోకి తీసుకెళ్లారు.

“ఛలో! తాతా విల్ షో సమ్‌థింగ్” అన్నారు పిల్లలు ఉత్సాహంగా.

“పిల్లలు! నా చిన్నతనంలో మేము చాల ఆటలు గేమ్స్ ఆడాము. మీకు చాల గేమ్స్ తెలియవు. ఐ విల్ టెల్ యు అబౌట్ దెమ్.”

“ఓకే తాతా! వి అర్ రెడీ”

తాత నవీన్ తన గదిలో ఉన్న ఒక ఓల్డ్ ట్రంక్ ని అటక మీదనుండి దించారు. పిల్లలు “వావ్! తాతా నిధి. ట్రెజర్ బాక్స్” అంటూ ముందుకు వచ్చారు.

నవీన్ తాత ట్రంక్ లోపలినుండి రెండు స్పిన్నింగ్ టాప్స్ (బొంగరాలు), దారం బయటకు తీశారు.

“this is the game” అన్నారు.

“వాట్? టాప్! అదొక బిగ్ గేమ్‌లా చెబుతావేంటి తాతా.? ఇదో పెద్ద సిల్లి గేమ్. బోరింగ్” అన్నారు పిల్లలు.

వాళ్ళని దగ్గరకు తీసుకుని నవీన్, “పిల్లలు! మీకు ఈ గేమ్‌లో ఉన్న మజా తెలియక బోర్ గేమ్ అంటున్నారు” అన్నారు.

“మజా? వాట్ మజా? బాయ్స్ గేమ్” అంది నిత్య.

“నిత్యా ఈ గేమ్ మీ నానమ్మా కూడా ఆడేది తెలుసా? its universal game. బాయ్స్ గర్ల్ అందరు ఆడేవాళ్ళం. one more thing ఈ గేమ్‌లో సైన్స్ ఉంది” అన్నారు తాతా.

“సైన్స్? అర్ యు కిడ్డింగ్?”

 “నో. ట్రూ. ఫిజిక్స్ సూత్రాలున్నాయి. physics Principles’ అన్నారు నవీన్.

“మీరు వింటే మీకు స్పిన్నింగ్ ది టాప్, సైన్స్ కధ చెబుతాను. సెటిల్ డౌన్”.

పిల్లలు కధ వినటానికి కూర్చున్నారు.

“హే! నేను చిన్నప్పుడు లట్టూ, బొంగరం గేమ్‌లో ఛాంపియన్ ని తెలుసా?” అన్నారు నవీన్ ఉత్సహంగా.

“వాట్ లట్టూ పట్టూ! సిల్లీ గేమ్” అన్నాడు వరుణ్.

“వినకుండా ఏమిటా మాటలు? నేను చెప్పను పో! అని పక్కకు తిరిగారు” బుంగమూతి పెట్టుకున్న తాత.

అది చూసిన పిల్లలు నవ్వి “సారీ సారీ! బోలో బోలో. చెప్పు. వింటాము తాతా” అన్నారు.

“ఆగండి” అని నానమ్మని పిలిచారు.

నానమ్మా నళినికి ఇంకో బొంగరం, దారం ఇచ్చారు.

ఇద్దరు బొంగరానికి దారం చుట్టి చేతిలో పట్టుకుని వేగంగా దారం లాగి నేలమీదకు వదిలారు. అవి నేలమీద గిరగిరా తిరగటం చూసిన పిల్లలు ‘హే’ అని అరిచారు. ఇంతలో తాత తిరుగుతున్నా బొంగరాన్ని ఒడుపుగా చేతిలోకి తీసుకున్నా అది ఆగలేదు. పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు.

నిత్యా, కిరణ్ “తాతా! ప్లీజ్ బొంగరం ఇవ్వు. మేము ట్రై చేస్తాము” అన్నారు

“ఓకే. గుడ్. ట్రై” అని ఇచ్చారు

వాళ్ళిద్దరికీ బొంగరానికి దారం ఎలా చుట్టి పట్టుకోవాలో అర్థం కాలేదు.

“తాతా! బొంగరానికి దారం ఎలా చూట్టాలి?”

“తాతా! ఎలా ఆడాలి? ఎంతమంది కావాలి?”

“వెయిట్! వెయిట్! కిరణ్ వరుణ్ బొంగరాన్ని చేతిలోకి తీసుకుని దాని మోన అంటే నెయిల్ కి దారాన్ని చుట్టాలి.”

పిల్లలు దారం నెయిల్ కి చుట్టారు. తాత చెప్పినట్లు గాల్లోకి విసిరి దారాన్ని వదిలారు. “హే! భలే తిరుగుతోంది. గిరగిరా!” అంటూ నిత్య చప్పట్లు కొట్టింది.

“తాతా బొంగరం కథ చెప్పవా?”

“రండి” అని ఉయ్యాలా బల్ల మీద అందర్నీ కూర్చోమన్నారు.

“పిల్లలు ఇది మన ప్రాచీన ఆటల్లో ఒకటి.”

“ప్రాచీన? అంటే ఏమిటీ?” అంది నిత్య

“ప్రాచీన అంటే ఓల్డ్, యాన్షియంట్. ఇట్స్ ఎ ట్రెడిషనల్ గేమ్. దీన్ని,ఇప్పటికి పల్లెల్లో పిల్లలు ఆడతారు.”

“తాతా! హౌ ఓల్డ్ ఈజ్ దిస్ గేమ్?”

“ఆ! 3500 బీసీ కంటే ఓల్డ్. అప్పట్లో బంక మన్ను… క్లే తో చేసిన బొంగరాలు వాడేవారట. తరువాత వుడెన్, గ్లాస్, మెటల్స్, పండ్ల గింజలు, మట్టి, ఎముకలు బోన్స్ రకరకాల బొంగరాలు చెయ్యటానికి వాడేవారు.”

“తాతా! లట్టూ, కంచ గేమ్ ఆడటానికి ఎంతమంది కావాలి?” అన్నాడు వరుణ్

“అబ్బా! వరుణ్! ఆపు నీ క్వశ్చన్స్” అన్నారు పిల్లలు

“పిల్లలు! Questioning is a good sign. If you ask more you learn more. క్లాస్‌లో కూడా భయపడకుండా అడగాలి. Let you guys ask” అన్నారు నవీన్.

“వరుణ్! ఫిక్స్‌డ్ నంబర్ లేదు. టు ఆర్ మోర్ కిడ్స్ ఆడుకోవచ్చు. యు నో, కొన్నిసార్లు కాంపిటేషన్స్ పెట్టుకుంటారు.”

“తాతా! ఎలా ఆడతారు? రూల్స్ ఏంటి?” అన్నాడు కిరణ్.

“ఫస్ట్ ఒక సర్కిల్ గియ్యాలి. ప్లేయర్స్ అందరు బొంగరానికి దారం చుట్టి రెడీగా ఉండాలి. తరువాత టాస్ వేసి ఎవరు ఫస్ట్ బొంగరం ఆడాలో సెలెక్ట్ చెయ్యాలి. కదా తాతా!” అంది నిత్య ఉత్సాహంగా.

“ఎస్! యు అర్ రైట్” అని నవీన్ చప్పట్లు కొట్టారు.

“ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసే ప్లేయర్ బొంగరం/లట్టూ/కంచాని స్పీడ్‌గా తిరిగేందుకు స్ట్రింగ్/దారాన్ని లాగి సర్కిల్ మధ్యలోకి వదలాలి. ఒక్కోసారి సేమ్ స్పీడ్‌తో బొంగరాన్ని అరచేతిలోకి తీసుకుని ఆగకుండా తిప్పాలి.”

పిల్లలు బొంగరం ఆటని ఊహించుకున్నారు. చేతుల వైపు చూసుకున్నారు.

“ఆమ్మో! బొంగరం మేకు గుచ్చుకోదా?” అంది నిత్య చేతులు దాచుకుంటూ భయంగా. నిత్య అమాయకత్వానికి నవీన్ నవ్వారు.

“ఎవరి బొంగరం పడిపోకుండా తిరిగి చేతిలోకి వస్తుందో వాడే విన్నర్. ఈ game rules simple,

  1. టాస్ వేసినప్పుడు అడిగింది రాకపోతే నెక్స్ట్ ప్లేయర్ టాస్ అడుగుతాడు.
  2. బొంగరాన్ని /టాప్ ని స్పిన్ చేసినప్పుడు అది మేకు /nail మీద నిలబడి తిరక్కుండా పడిపోతే mattai /మత్తై అంటారు.
  3. బొంగరాన్ని దారంతో సరిగ్గా పట్టి వదల్లేక పోయిన /unable to spin ఓడిపోయినట్లే
  4. టాస్ ఓడిన ప్లేయర్ బొంగరాన్ని /టాప్ ని సర్కిల్ మధ్యలో ఉంచి తిరగనివ్వాలి దాన్ని టాస్ గెలిచినా ప్లేయర్స్ టాప్స్‌తో ఎటాక్ చేస్తారు.
  5. కొన్ని సార్లు సర్కిల్ లో తిరుగుతున్నా టాప్స్ /బొంగరాల మీద ఇంకో ప్లేయర్ బొంగరం మేకు వెళ్లి తగిలితే /పడితే దాన్ని ఆక్కర్ అంటారు
  6. ఎవరి బొంగరం ఎంత ఎక్కువ సేపు పడకుండా తిరిగితే వాడే విన్నర్.
  7. ఎవరి బొంగరానికి తక్కువ దెబ్బలు/ఆక్కర్ లు ఉంటే వాడు ఛాంపియన్. లుక్! నా బొంగరానికి తక్కువ దెబ్బలున్నాయి. అన్నారు నవీన్. పిల్లలు టాప్ ని పరీక్షగా చేసి “అవును యూ ఆర్ ఎ ఛాంపియన్” అన్నారు.
  8. కొన్ని సార్లు ప్లేయర్స్ another / extra బొంగరం ని దెబ్బలు తినటానికి యూజ్ చేస్తారుట. అంటే టు టాప్స్. వన్ ఫర్ స్పిన్నింగ్, వన్ ఫర్ టేకింగ్ హిట్.

“అదెలా?” అన్నాడు వరుణ్

“నాకు తెలీదు. విన్నాను అంతే” అన్నారు నవీన్.

“మీకు తెలుసా లట్టూ/బొంగరం ఆట పురాతన ఆట/ఓల్డ్ గేమ్ అయినప్పటికీ పిల్లలకి సైన్స్‌లో హెల్ప్ చేస్తుంది. It’s a scientific game” అన్నారు తాత నవీన్.

“రియల్లీ? హౌ?” అన్నారు పిల్లలు

“ఎలా అంటే? ముందు నాకు ఇది చెప్పండి. మేకు/నెయిల్ మీద బొంగరం పడకుండా ఎలా తిరుగుతుంది?”

“ఆ ఆ! ఐ డోంట్ నో. నువ్వు చెప్పు తాతా” అంది నిత్య.

“ఎలా అంటే ఇటు చూడండి బొంగరాన్ని చేతిలో పట్టుకుని చూస్తే అది పిరమిడ్ ఆకారం/షేప్‌లో ఉంది.”

“అవును. భలే భలే వావ్.”

“నెక్స్ట్ బొంగరం చుట్టూ ఉన్న grooves దారం/స్ట్రింగ్ ని చుట్టి పట్టుకోవటానికి. దారంతో బొంగరాన్ని లాగి వదిలినప్పుడు జిరోస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల నెయిల్ /మేకు మీద బొంగరం పడకుండా బాలన్స్ అవుతూ తిరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించి ఉపయోగిస్తున్న యూనివర్సల్ లాస్ అఫ్ గ్రావిటీ, మొమెంటమ్, ఫ్రిక్షన్, ఇనెర్షియా, ఏ విధంగా కైనెటిక్ ఎనర్జీకి కారణం అవుతాయో కనుక్కున్నారు సైంటిస్ట్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. ఓల్డ్ ట్రెడిషనల్ గేమ్‌లో సైన్స్ లాస్ / సూత్రాలున్నాయని తెలీకుండానే ఆడుతున్నారు. సైన్స్ క్లాస్ లో బొంగరంతో లా ఆఫ్ గ్రావిటీ చెబితే?”

“It’s fun and interesting” అన్నాడు కిరణ్.

“తాతా! టెల్ మీ సమ్ మోర్” అన్నాడు వరుణ్.

“Some more about what? దీనిగురించి ఇంకా చెప్పాలి?” అన్నారు నవీన్.

“బొంగరం గురించి. హిస్టరీ.”

“ఓహ్. ఓకే. పిల్లలు టైం పాస్ గేమ్‌గా ఆడితే పెద్దలు బొంగరం ఆటని భవిష్యత్తు/ఫ్యూచర్ ప్రెడిక్షన్స్… అంటే జోస్యం చెప్పటానికి వాడారు. కొంతమంది దేవుడికి ఆఫరింగ్‍గా యూజ్ చేశారట. కొన్ని దేశాల్లో మరణం/డెత్ తరవాత ప్రయాణం కోసం ఉంచే వస్తువులతో పాటు బొంగరంని పెట్టేవారట.”

“అంటే ఈజిప్ట్ మమ్మీ పిరమిడ్స్‌లో లాగా అన్నమాట అవునా?” అన్నాడు కిరణ్.

అవును. కొన్నివేల సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా దేశాలలో ఈ ఆటను ఆడేవాళ్లు. ఆడుతున్నారు. 2000 bcలో వుడెన్/చెక్క బొంగరం వాడకంలోకి వచ్చిందిట. యూరోప్ లో కొన్ని దేశాలలో స్పిన్, ఇంకా టాప్స్ బోన్స్/ఎముకలతో చేసినవి దొరికాయి. వెరీ ఓల్డ్ క్లే టాప్ 35 BC ది ఇరాక్‌లో దొరికింది. వుడెన్ టాప్ ఒకటి 1300 BC ది king tut సమాధిలో దొరికిందిట. పండ్లు, గింజలు, నట్స్, క్లే, వుడ్, లోహం/మెటల్స్, ప్లాస్టిక్ దేనితో చేసిన బొంగరం ఒకే రకం గ్రావిటీ/గురుత్వాకర్షణ శక్తిని ఇస్తుందిట. టాప్ ని స్పిన్ చేసేటప్పుడు అంటే బొంగరాన్ని తిప్పే ముందు నిట్ట నిలువుగా అంటే రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ లో పట్టుకుని వదలాలి.”

“Wow. తాతా మాకు స్పిన్నింగ్ టాప్ గేమ్ నేర్పిస్తావా?” అన్నారు పిల్లలు ఉత్సాహంగా.

“తాతా! బొంగరం గేమ్ లో పోటీలు/కాంపిటిషన్స్ జరిగాయా?” అన్నాడు కిరణ్.

“చాల దేశాల్లో జరిగాయి. ఇప్పటికి కొన్ని చోట్ల పోటీలు పెట్టి ఆడుతారు. యూరోప్‌లో ఈ ఆట ఫేమస్. అక్కడి పురాతన పెయింటింగ్స్‌లో కనిపిస్తుందిట. ఫుట్ అండ్ టేక్ స్టైల్‌లో రోమన్స్ ఆడేవారుట. 1500 years క్రితం జర్మనీలో డ్రెయిడేల్/dreidel స్పిన్ టాప్‌ని jews చేశారట. 1920లో అమెరికాలో ఫుట్ అండ్ టేక్ స్పిన్స్ పాపులర్ గేమింగ్ టాప్ teetotum కి ఫోర్ సైడ్స్/నాలుగు పక్కలు చదునుగా ఫ్లాట్ గా ఉండి ADNT ఉండి గేమ్ లో result /ఫలితం చెప్పేవి. ప్రస్తుతం 1969 లో world famous architect ray and Charles earns టాప్స్ అని ఒక షార్ట్ ఫిలిం/లఘు చిత్రం తీశారట. మనం వాడే కొన్ని వస్తువులు కూడా టాప్ లా/బొంగరంలా పనిచేస్తాయి. చేత్తో తిప్పితే దారం లేకుండా.”

“అవును తాతా. క్రింద పడిన గ్లాసు, బోర్డు పిన్న్స్” అన్నాడు వరుణ్

“రియల్లీ!” అంటూ నవీన్ ఆశ్చర్యం నటించారు.

“ఇంకో విషయం తెలుసా? జపాన్ లో బొంగరాన్ని koma అంటారట. కొరియా జపాన్ పిల్లలకు ఇష్టమైన ఆట స్పిన్నింగ్ టాప్/ బొంగరం ఆట. మలేసియా,ఇండోనేషియాలో బొంగరాన్ని స్పిన్నింగ్ టాప్ ని gasing అంటారు

పూర్వం పంట కోతల సమయం లో అంటే crop harvesting time లో పోటీలు పెట్టుకుని ఆడేవారుట. మన దేశంలో బొంగరాన్ని బాంబరం అని కన్నడ తమిళ్‌లో పిలుస్తారు. లట్టూ ఆని ఉర్దూలో, ఇంగ్లీష్‍లో టాప్ అని, తెలుగులో బొంగరం అని అంటారు. ఇది స్పిన్నింగ్ టాప్ స్టోరీ. బొంగరాల ఆట కథ” అన్నారు నవీన్.

“తాతా సాంప్రదాయ/పురాతన ఆటల్లో సైన్స్ ఉందని, ఫన్ ఉందని మాకు తెలీదు” అన్నారు పిల్లలు.

“నాట్ ఓన్లీ ఫన్, టాప్‌ని పడకుండా స్పిన్ చెయ్యాలంటే, బొంగరాన్ని పడకుండా ఎక్కువసేపు తిరిగేలా చెయ్యటానికి స్కిల్ ఉండాలి. స్కిల్/ఒడుపు, concentration / ఏకాగ్రత, సరిగ్గా దారం చుట్టి పట్టుకుని విసిరి

తరువాత skillful /ఒడుపుగా బొంగరాన్ని నేలమీదనుండి చేతిలోకి తీసుకుని ఆగకుండా చూడటానికి టైమింగ్, యాంగిల్ తెలియాలి. అదే ఏకాగ్రతను చదువులో పెడితే యు అర్ ద విన్నర్” అన్నారు నవీన్.

“పదండి బజార్ కి వెళ్లి బొంగరాలు కొనుక్కుని ఆట నేర్చుకుందురు.”

“హే హే! we are going to learn and play bongaram!” అని కేరింతలు కొట్టారు పిల్లలు.

“పదండి మీరు కొనుక్కుందురు గాని బొంగరాలు. let us play spinning top and learn gravity.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here