[dropcap]బ్ర[/dropcap]తుకే ఒక సేద్యంగా చేయాలని ఉంది,
మానవతా మధురాలను పంచాలని ఉంది.
హృదయమనే చేను గట్టు వేగంగా చేరుతూ,
కల్ముషాల కలుపు మొక్క తుంచాలని ఉంది.
సమాజమను తోటకు తోటమాలి నేనవుతూ,
మనిషికి ఒక మంచి నీడ పెంచాలని ఉంది.
అభ్యుదయం శాంతి పథం మార్గం నిర్దేశిస్తూ,
జగతికి ఒక గమ్యం చూపించాలని ఉంది.
కరుణ లేని మనసుకు గమ్య మెక్కడుంది ‘శ్రీయా’
ఒక చల్లని బాటను నడి పించాలని ఉంది.