కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-3

0
3

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

సారనాథ్

[dropcap]సా[/dropcap]రనాథ్ కాశీకి దగ్గరలో వున్న చిన్న పట్టణము. వారణాసికి దాదాపు 8 కి.మీ. వుంటుంది. బౌద్ధులకు అతి ప్రధానమైన పుణ్యక్షేత్రము.

బౌద్దులకు మొత్తము నాలుగు క్షేత్రాలున్నాయి. బుద్ధుని జన్మస్థలము అయిన లుంబిని, ఆయనకు జ్ఞానోదయమైన బోధగయ, జ్ఞానము మొదట ఉపదేశించిన సారనాథ్, మరణించిన కుషీనగరు. గౌతముడు బుద్ధునిగా మారి (జ్ఞానము కలిగినతరువాత) ఆయనకు కలిగిన జ్ఞానాన్ని పంచుకోవటము గురించి కొంత ఆలోచించి, కొంత మథనపడి సారనాథ్ వస్తాడు. పడవలో రావటానికి ఆయన వద్ద డబ్బులు వుండవు. కష్టం మీద నది దాటి సారనాథ్ వచ్చిన బుద్దుడు అక్కడి రావి చెట్టు క్రింద కూర్చొని తన మిత్రులు ఐదుగురికి తనకు కలిగిన జ్ఞానము ఉపదేశిస్తాడు.

ఆ విధముగా చెప్పుకుంటే సారనాథ్ ‘బౌద్ధము’ పుట్టిన ప్రదేశము. ఆ వానాకాలము బుద్ధుడు అక్కడే గడుపుతాడు. ఆయన బోథ చేసిన ఆ చెట్టు ఎంతో పవిత్రమైనదిగా కొలుస్తారు బౌద్ధులు. ఆయన పడవ సంగతి తెలసిన రాజు బిందుసారుడు బాధపడి పడవ రుసుము తీసివేస్తాడు తరువాత.

సారనాథ్ చాలా గొప్ప కట్టడాలతో, బుద్ధుని ఎన్నో పవిత్ర దేవాలయాలతోను, మ్యూజియము, స్తూపము, బౌద్ధ చైత్రాల శిధిలాలతో అలరాడుతూ కనపడుతుంది. విశాలమైన రోడ్డుతో శుభ్రమైన పట్టణము. కాశీ లోని హడావిడి సారనాథ్‌లో వుండదు. మౌనము, ధ్యానము మీద ఎక్కువ ధ్యాస ఇక్కడ.

అశోకుడు బౌద్ధము వ్యాప్తి చేసిన రాజు. కళింగ యుద్దమునకు (260 బిసీ)ముందు రక్తపిపాసిగా పేరు పొందిన ఆయన, ఆ యుద్ధం తరువాత పూర్తి శాంతిదూతగా మారుతాడు. 263బిసీలో బౌద్ధము స్వీకరించి, తన పిల్లలను సింహళము పంపుతాడు బౌద్ధ వ్యాప్తికై.

ఆయన ఎన్నో స్తూపాలు, చైత్రాలు కట్టించాడు. అందులో సారనాథ్‌లో కట్టించినది ప్రముఖమైనది.

అశోకుడు కట్టినవాటిలో అతి పెద్ద బౌద్ధ చైత్రము, స్థూపము ఇక్కడిదే. తురుష్కుల దండయాత్రలో చాలా భాగము కూలిపోగా ఒక్క స్తూపము మాత్రం మిగిలింది గుర్తుగా. ఆ శిథిలాలలో అశోకుడు కట్టిన ధర్మచక్ర స్తూపాన్ని కనుగొని ప్రభుత్వము వారు జాతీయ చిహ్నంగా తీసుకున్నారు. అత్యంత రాజసముగా నిలువెత్తు నాలుగు సింహాలు, వాటి క్రింద ధర్మచక్రము, పై ముక్కగా ఆ స్తంభము ధ్వంసం చేసినప్పుడు క్రిందపడ్డాయి. క్రింద పడిన ముక్కలను యథాతథంగా మ్యూజియంలో వుంచారు. స్తంభం మొదలు మాత్రం అద్దాల మధ్య వాటి యథాస్థానములో కనపడుతుంది. ఆ శిలలు అక్కడి మ్యూజియములో చూడవచ్చు.

అక్కడ బౌద్ధము అవలంబించే దేశాలు వారి గుర్తులుగా దేవాలయాలు నిర్మించారు. చైనా, జపాను, మలేషియా, శ్రీలంక కట్టడాల దేవాలయాలు, అందులో తథాగతుని మనము చూడవచ్చు. వారి శైలి, తేడాలు చూసి అర్థము చేసుకోవచ్చు.

ఆ చైత్ర విశాల ప్రాంగణములో అప్పటి వారి ఉన్నతమైన జీవితము, తథాగతుని గుర్తుల మధ్య తిరిగుతుంటే ఏవో చదివిన జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. బుద్ధిని బోధలు, విద్య కోసం చైత్రాలు, బౌద్ధ బిక్షువులు వుండటానికి ఆవారాలు, మధ్యలో పెద్ద అసెంబ్లీ హాలు, వీటి ప్రక్కన బుద్ధుని అస్తికలపై కట్టిన బుద్ధ స్తూపము మనము చూడవచ్చు. స్తూపము తప్ప మిగిలినవన్నీ దండయాత్రలో నేలమట్టమై, మనకు వాటి పునాదులు, మొదలు కనిపిస్తుంది. బుద్ధ స్తూపము కూడా పై శిలలు కొద్ది చోట్ల మాత్రమే వుండి మీగిలినది ఇటుకలతో కాలిన గుర్తులతో కనపడుతుంది.

ఆంత విశాలమైన ప్రాంగణము, బౌద్ధ మంత్రాలతో ప్రతిధ్వనించి నేడు పునాదులుగా మిగిలింది.

మేము వెళ్ళి బుద్ధుని స్తూపము ప్రక్కన కూర్చుని ప్రశాంతతను అనుభవిస్తూ వుంటే జపాను నుంచి కొందరు బౌద్ధులు వచ్చి ప్రార్థనలు మొదలెట్టారు. వారి తరువాత శ్రీలంక నుంచి వచ్చిన కొందరు భక్త బౌద్ధులు వారి బాషలో ప్రార్థించటము ప్రారంబించారు. అది చూసి అక్కడ్నుంచి మ్యూజియంకు కదిలాము.

చైనా వారు కట్టిన దేవాలయము, బౌద్ధము పుట్టిన చెట్టు ప్రక్కనే వుంది. అందులో నిలువెత్తు బుద్ధుని దర్శించి పార్కు మధ్యలో నిలబడిన పెద్ద బుద్ధవిగ్రహము కూడా చూశాము. మన హుసేనుసాగర్‌లో వుంచిన బుద్ధుని తలపించింది ఈ విగ్రహము. సారనాథులో మిగిలిన దేవాలయాలు దర్శించి నేను రూముకు మరలాను.

మా వాళ్ళు మరోటి చూడటానికి వెళ్ళిపోయారు

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here