వారెవ్వా!-6

0
3

భావ ప్రకటన స్వేచ్ఛపైన పొంగిపొరలెను చర్చలెన్నో
భావ ప్రకటన హక్కు తోడ బాధ్యతుందని మరిచిరేమో!
ఒకరి భావము ఇతరులకు ఏ బాధ పంచిన తప్పు కాదట
జండా తమదే ఎగురవలెనని ఇతర జండాపై విమర్శలు
నేను మాత్రం గుంటనక్కల గొంతు నులుముట న్యాయమంటా.

కాషాయీకరణమంటూ కదనుదొక్కిరి కలహప్రియులు
వారి రంగే ఎల్లకాలము కొల్లగొట్టుట ప్రగతియనిరి
యువత బుర్రల బూజు నింపి, భవిత ప్రశ్నార్థకము జేసిరి
కులము, మతము, రాజకీయము కలహముల నెలవాయె విద్య
నేను మాత్రం కపట నాటకకర్తలను కడిగేయుమంటా.

ప్రభుత్వ పురస్కారములు పంతముల యంత్రాంగమాయె
ప్రతిభ పేరున అవకతవకల ప్రహసనమ్ముల వేడుకాయె
న్యాయనిర్ణేతలుగ వారే వర్గపోరాటాల వలచిరి
సాహితీకృషి, వయసునందున సీనియర్స్‌ను నీట ముంచిరి
న్యాయదేవత కళ్ళు గప్పి జూనియర్స్‌ను గౌరవించిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here