[dropcap]గ[/dropcap]గనాన దాగిన ఓ జాబిలమ్మ
రావేల నా దరికి
రారాదు నీవు
నా మీద ఎందుకు అలక?
పలకవా ఒక మారు
తప్పు నాదైనచో క్షమించు
నను ఒక మారు
మురిపెము నీవైతే మారు మాట ఆడను
నిన్ను మరిచిన హృదయం నాదైతే…
మురిపించకుమా మాటాడుమా నాతో
కలలో నైనా నీ తలపే
మెలకువలోనైన నీ తలపే
నా ఈ మూగ నోము
ఇంకెన్నాళ్ళు నా ప్రియతమా
రావేల నా దరికి
రారాదా నీవు
మన్నించు మన్నించుమా ఓ చందమామ.