[dropcap]రం[/dropcap]గురంగుల స్మార్టు ఫోన్లు హంగెలెన్నీ వెరైటీలు
ఆట పాటలు, వార్తలతో డిజిట్ల మాయల గారడీలు
చిన్న పిల్లల చేతిలోన సాంత్వనాలు సెల్లుఫోనులు
కళ్ళు చెదిరే దృశ్యాలతో ఒళ్ళు మరిచిరి, మంకు మానిరి
హద్దు మీరిన గారాబము భవిష్యత్తుకు గుద్దులాయెను.
టీ.వీ. చానల్సందు డైలీ సీరియల్స్ బోలెడాయెను
నతి, రీతిని మరచిపోవగ లేడి విలనుల కాలమొచ్చెను
విలువ లేనివి వేలకొలది సంచికలుగ సాగదీసిరి
పగ, ద్వేషం, ప్రతీకారం పల్లవించెను క్షణ క్షణము
భవిష్యత్తున జరగబోయెడు బాధ గాధలు తెలియలేదు.
దౌర్జన్యం, దొంగతనం, రాజకీయపు టెత్తుగడల
కొత్త దారులు జూపుచుండిరి కర్తవ్యం మరచిపోయిరి
ఒకని పెళ్ళాం నింకొక్కడ్ పెళ్ళాడుట కెత్తు వేయగ
ఒకరి భర్తను మరో యువతి లాగుకొను పరమార్థమాయెను
శృంగారము, శోభనము బడి పిల్లలకు అవగాహనాయెను.