‘నివురు’ పుస్తక పరిచయం

0
4

‘నిజం’ అనే కలం పేరుతో కవితలు సృజించే గార శ్రీరామమూర్తి 141 కవితల సంపుటి ‘నివురు’.

‘నిష్ఠుర నిజాల నిప్పులీ జనపదాలు!’ అన్న ముందుమాటలో “ఈ సంపుటితో వందకు పైగా కవితలున్నాయి. ఇవన్నీ ఒక రకంగా, అనుదిన, తక్షణ స్పందనలు. సామూహిక ఘటన పట్ల పరిణామాల పట్ల, అవ్యవస్థ పట్ల ఒక సృజనాత్మక స్పందనశీలి భావోద్వేగ ప్రకటనలివి” అని రాశారు ఎన్. వేణుగోపాల్.

‘గడప’ అనే ముందుమాటలో శివాజీ “సమాజంలోని పబ్లిసిటీ సహిత హాట్ సబ్జెక్టులు ఏవో ఎంచుకుని ఆయా సమస్యల ముందు నిరసన కొవ్వొత్తులు పట్టి పెరేడ్ చేయవసలే. దవడలు వాయించి లెక్కలు తేల్చమన్నట్టు ఉంటాయవి. ఆ వెంట కొన్ని కవితలు ‘వాట్ మస్ట్ బీ డన్’ అంటాయి. మరిన్ని అయితే మనం ముఖం చాటేసి తప్పుకోకుండా కరుణ ముఖ్యమని చెబుతూ చీకటి వేకువలో మెలకువ తెప్పిస్తాయి” అని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

సామాజిక స్పృహ ఉన్న కవిత్వం పట్ల ఆసక్తి ఉన్న వారందరినీ అలరిస్తుందీ కవితా సంపుటి.

***

నివురు (కవితలు)
రచన: నిజం
పేజీలు: 222
వెల: రూ.125/-
ప్రతులకు:
నిజం ప్రచురణలు
ఎ-26, జర్నలిస్ట్ కాలనీ,
జుబిలీహిల్స్, హైదరాబాద్ 500033
ఫోన్: 9440310013
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here