[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
మలయ:
ఏవం, సఖే. సమ్య గ్దృష్ట వా నసి. యతో ఽమాత్యవధే ప్రకృతిక్షోభః స్యాత్. ఏవం చ సన్దిగ్ధో విజయః.
అర్థం:
ఏవం=అలాగే, సఖే=మిత్రమా, సమ్యక్+దృష్టవాన్+అసి=సమగ్రంగా దర్శించావు. యతః=ఎందుకంటే, అమాత్యవధాత్=రాక్షసమంత్రిని చంపినందువల్ల, ప్రకృతిక్షోభః=ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. ఏవం+చ=అంతేకాదు, విజయః+సన్దిగ్ధః=యుద్ధ జయం అనేది కూడా సంశయంలో పడుతుంది.
పురుష:
(ప్రవిశ్య) జేదు కుమారో, అజ్జ గుమ్మట్ఠాణాధికిదో దీహ రక్ఖో విణ్ణ వేది. – ‘ఏసో ఖు అమ్హేహిం కడహాదో ధిక్కమన్తో అగహీదముద్దో సలేహో పురిసో గహీదో. తా పచ్చక్ఖీక రేదు ణం అజ్జౌ‘త్తి॥
(జయతు కుమారః. ఆర్య, గుల్మస్థానాధికృతో దీర్ఘ రక్షో విజ్ఞాపయతి ‘ఏష ఖ ల్వస్మాభిః కటకాన్నిష్క్రామన్న గృహీత ముద్రః సలేఖః పురుషో గృహీతః, తత్ప్రత్యక్షీకరోత్వేన మార్యః‘ ఇతి.)
అర్థం:
(ప్రవిశ్య= ప్రవేశించి), జయతు+కుమారః=రాకుమారునికి జయం! ఆర్య=అయ్యా, గుల్మస్థాన+అధికృతః+దీర్ఘరక్షః=శిబిర స్థానాల అధికారి దీర్ఘరక్షుడు, విజ్ఞాపయతి=మనవి చేస్తున్నాడు – ‘అస్మాభృః=మాచేత, ఏషః+(పురుష) ఖలు= ఈ (ఒకానొక) వ్యక్తి అయితే, కటకాత్+నిష్క్రామన్=శిబిరం దాటుకుపోతూ – అగృహీత+ముద్రః=అనుమతి ముద్ర లేకుండాను, స+లేఖః=(చేతిలో) ఒక ఉత్తరంతోనూ ఉన్న, పురుషః+గృహీతః=మనిషిని పట్టుకోవడం జరిగింది, తత్=అందుచే, ఏనం+ప్రత్యక్షీకరోత్+ఆర్యః=అయ్యగారు వీనిని చూతురు గాక’ ఇతి=అని.)
భాగు:
భద్ర, ప్రవేశయ.
అర్థం:
భద్ర=నాయనా, ప్రవేశయ=రప్పించు.
పురుష:
తహ. (తథా.) – (ఇతి నిష్క్రాన్తః)
అర్థం:
తథా=అలాగే (చేస్తాను). (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు)
(తతః ప్రవిశతి పురుషే ణానుగమ్యమానః సంయతః సిద్ధార్థకః)
(తతః=ఆ మీదట, పురుషేణ+అనుగమ్యమానః=ఆ వ్యక్తి తన వెంట వస్తుండగా, సంయతః+సిద్ధార్థకః=బాధింపబడిన సిద్ధార్థకుడు, ప్రవిశతి=ప్రవేశించాడు.)
సిద్ధార్థ:
(స్వగతమ్)
అర్థం:
(స్వగతమ్=తనలో).
శ్లోకం:
ఆణంతీఏ గుణేసు, దోసేసు పరంముహం కుణంతీఏ
అమ్హారిసజణణీఏవ పణమామో సామిభత్తీఏ. (9)
(ఆనయన్యై గుణేషు దోషేషు పరాఙ్ముఖం కుర్వత్యై
అస్మాదృశజనన్యై ప్రణమామః స్వామిభక్త్యె.)
అర్థం:
గుణేషు+ఆనయన్యై=గుణాలను దగ్గరకు జేర్చేది, దోషేషు+పరాఙ్ముఖం+కుర్వత్యై=తప్పులకు ముఖం తిప్పుకునేది (అయిన),
అస్మాదృశ+జనన్యై=మా బోటి వార్కి తల్లి అయిన, స్వామిభక్త్యె=స్వామిభక్తికి, ప్రణమామః=నమస్కరిస్తున్నాను.
వృత్తం:
ఆర్య.
అలంకారం:
దేశ (స్వామి) భక్తిని తల్లిగా రూపించి చెప్పడం వల్ల రూపకాలంకారం (అస్మాదృశజనన్యై స్వామిభక్త్యె). (విషయ్యభేద తాద్రూప్య రఞ్జనం విషయస్య యత్ రూపకం -అని కువలయానందం).
వ్యాఖ్య:
సిద్ధార్థకుడు తాను చేస్తున్నది (లేఖ, నగలపెట్టె, ఆ విధంగా తీసుకుని, ఆమోద ముద్ర లేకుండా గుల్మాధికారిని దాటుకు పో ప్రయత్నించడం) తప్పని తెలిసినవాడు. అయినా స్వామిభక్తితో – తన కప్పగించిన గూఢచారి పని – నెరవేరుస్తున్నాడు. ఇట్టి సందర్భంలో – లౌకికంగా తప్పుగా పరిగణించదగినదైనా, తల్లి వంటి స్వామిభక్తిని సేవించే సందర్భంలో తప్పు కాజాలదని సమర్థించుకుంటున్నాడు.
పురుష:
అజ్జ, అఅం సో పురిసో. (ఆర్య, అయం స పురుషః)
అర్థం:
ఆర్య=అయ్యా, అయం+సః+పురుషః=ఇతడే ఆ వ్యక్తి.
భాగు:
(నాట్యే నావలోక్య) భద్ర. కి మయ మాగన్తుకః, ఆహోస్విత్ ఇ హైవ కస్యచి త్పరిగ్రహః?
అర్థం:
(నాట్యేన+అవలోక్య=నాటకీయంగా చూసి) భద్ర=నాయనా!. కిమ్+అయం+ఆగన్తుకః?=ఆ అపరిచిత వ్యక్తి ఇతడేనా – (ఇది పురుషుడికి భాగురాయణుడి నిర్ధారక ప్రశ్న) – (దీనికి సిద్ధార్థకుడే కలగజేసుకుని సమాధానం చెపుతున్నాడు).
సిద్ధార్థ:
అజ్జ, అహం ఖు అమచ్చరక్ఖసస్స సేవఓ. (ఆర్య, అహం ఖలు అమాత్యరాక్షసస్య సేవకః.)
అర్థం:
ఆర్య=అయ్యవారూ, అహం+ఖలు=నేనైతే, అమాత్య+రాక్షసస్య+సేవకః=రాక్షసమంత్రి గారి సేవకుణ్ణి.
భాగు:
భద్ర, తత్ కి మగృహీతముద్రః కటకాన్నిష్క్రామసి?
అర్థం:
భద్ర=నాయనా, తత్=అలాగైతే, అగృహీత+ముద్రః=అనుమతి ముద్ర తీసుకోకుండా, కటకాత్=శిబిర ప్రదేశం నుండి, కిమ్+నిష్క్రామసి=ఎందుకు వెళ్ళిపోతున్నావు?
సిద్ధార్థ:
అజ్జ, కజ్జగోర వేణ తువరావిదోహ్మి (ఆర్య, కార్యగౌరవేణ త్వరాయితోఽస్మి.)
అర్థం:
ఆర్య=అయ్యవారూ, కార్యగౌరవేణ=ముఖ్యమైన పని కావడం వల్ల, త్వరాయితోఽస్మి=త్వరపడవలసి వచ్చింది.
భాగు:
కీదృశం త త్కార్య గౌరవం, య ద్రాజ శాసన ముల్లఙ్ఘయతి?
అర్థం:
యత్+రాజశాసనం+ఉల్లఙ్ఘయతి+తత్+కార్యగౌరమమ్+కీదృశం=రాజ శాసనాన్ని ధిక్కరించేటంతడిదా ముఖ్యమైన పనేమిటి?
మలయ:
సఖే భాగురాయణ, లేఖ మపనయ.
అర్థం:
సఖే=మిత్రమా! భాగురాయణా!, లేఖం+అపనయ=(అతడి వద్ద నున్న) ఉత్తరాన్ని ఇలాగ తీసుకో.
భాగు:
(సిద్దార్థకహస్తా ద్గృహీత్వా పత్ర ముద్రాం దృష్ట్వా) కుమార, అయం లేఖః। రాక్షస నామాఙ్కితేయం ముద్రా।
అర్థం:
(సిద్దార్థక+హస్తాత్+ గృహీత్వా=సిద్ధార్థకుడి చేతి నుంచి తీసుకుని, పత్ర+ముద్రాం+దృష్ట్వా=కాగితంపై ముద్రను చూసి) కుమార=రాకుమారా, అయం+లేఖః=ఇదిగో ఉత్తరం. ఇయం+ముద్రాః=(దీనిపై) ఈ ముద్ర, రాక్షస+నామ+అఙ్కితేయం=రాక్షసుడి పేరుతో ఉంది.
మలయ:
ముద్రాం పరిపాలయన్ ఉద్ఘాట్య దర్శయ.
అర్థం:
ముద్రాం+పరిపాలయన్= ఆ ముద్ర (చెరిగిపోకుండా) కాపాడుతూ, ఉద్ఘాట్య=(లేఖను తెరిచి), దర్శయ=చూపించు.
(భాగురాయణః తథా కృత్వా దర్శయతి)
అర్థం:
(భాగురాయణః+తథా+కృత్వా=భాగురాయణుడు అలాగ చేసి, దర్శయతి=చూపిస్తున్నాడు).
మలయ:
(వాచయతి) స్వస్తి. యథాస్థానం కుతోఽపి కోఽపి కమపి పురుష విశేష మవగమయతి. అస్మత్ప్రతిపక్షం నిరాకృత్య దర్శితా కాపి సత్యతా సత్యవాదినా. సంప్రతి ఏతేషా మపి ప్రథమ ముపన్యస్త సన్ధీనా మస్మత్సుహృదాం పూర్వ ప్రతిజ్ఞాత సన్ధి పరిపణన ప్రోత్సాహనేన సత్యసన్ధః ప్రీతి ముత్పాదయితు మర్హతి. ఏతే ఽ ప్యేవ ముపగృహీతాః, స్వాశ్రయవినాశే నోపకా (పాహా) రిణ మాశ్ర (పా. రాధ)యిష్యన్తి, అవిస్మృత మేత త్సత్యవతః స్మారయామః, ఏతేషాం మధ్యే కేచి దరేః కోశదణ్డాభ్యా మర్థినః, కేచి ద్విషయే ణేతి, అలఙ్కారత్రయం చ సత్యవతా య దను ప్రేషితం త దుపగతమ్. మయాపి లేఖ స్యాశూన్యార్థం కిఞ్చి దనుప్రేషితం, తదుపగమనీయమ్. వాచికం చాప్తతమా త్సిద్ధార్థకా చ్ఛ్రోతవ్య మితి.
అర్థం:
(వాచయతి=చదువుతున్నాడు) స్వస్తి=శుభం. యథాస్థానం=యుక్తమైన ప్రదేశం నుంచి, కుతః+అపి=ఎక్కడ నుంచో, కః+అపి=ఎవని చేతనో, కమ్+అపి=ఎవనిని ఉద్దేశించో (ఎవని కొరకో), పురుషవిశేషం+అవగమయతి=ఒకానొక ప్రత్యేక వ్యక్తికి తెలియజేస్తున్నాడు. అస్మత్+ప్రతిపక్షం+నిరాకృత్య=మన శత్రువును కాదని, సత్యవాదినా=సత్యానికి కట్టుబడే వాడి చేత, క+అపి+సత్యతా=ఒకానొక యథార్థ విషయం, దర్శితా=గమనించడం జరిగింది.
సంప్రతి=ప్రస్తుతం, ప్రథమం+ఉపన్యస్త+సన్ధీనాం=తొలుతగా ఏర్పర్చుకున్న సంధుల ప్రకారం, అస్మత్+సుహృదాం=మా మిత్రులకు, పూర్వ+ప్రతిజ్ఞాత+సన్ధిపరిపణన+ప్రోత్సాహనేన= ఇంతకు ముందు మాట ఇచ్చిన ప్రకారం ఇవ్వవలసిన దానితో ప్రోత్సాహం తెలియజేయడం ద్వారా, సత్యసన్ధః=సత్యానికి కట్టుబడిన వాడు, ప్రీతిం+ఉత్పాదయితుం+అర్హతి=సంతోషపెట్టదగినవాడు. ఏతే+అపి=వీరు కూడా, ఏవం+ఉపగృహీతాః=ఈ విధంగా దగ్గరకు (మిత్రులుగా) తీయబడిన వారై, స్వాశ్రయ+వినాశేన=తమ ఆశ్రయ స్థానాన్ని తుదముట్టించి, ఉపకారిణం+ఆశ్రయిష్యన్తి=ఉపకారిని (మాట నెరవేర్చినవానిని) ఆశ్రయించగలరు, అవిస్మృతం+ఏతత్=మరువబడని దీనిని, సత్యవతః+స్మారయామః=(ఆ) సత్యవాదికి గుర్తు చేస్తాము, ఏతేషాం+మధ్యే=వీరి నడుమ, కేచిత్=కొంతమంది, అరేః+కోశ+దణ్డాభ్యాం=శత్రువుల ధనాన్ని, సేనను; అర్థినః=కోరుకునేవారు; కేచిత్+విషయేణ+ఇతి=కొందరు (శత్రువు యొక్క) ప్రదేశాలను (కోరుకునేవారు) అని – (ఉంటారు), సత్యవతా+యత్+అనుప్రేషితం+అలఙ్కారత్రయం=సత్యవాది చేత పంపబడిన ఈ మూడు నగలు, తత్+ఉపగతమ్=అందినవి (పొందడం జరిగింది). మయా+అపి=నా చేత కూడా (నేను కూడా), లేఖస్య+అశూన్యార్థం=లేఖతో కూడా కానుకగా, కిఞ్చిత్=కొంతగా (దృఢపరుచుకోడం కోసం) అనుప్రేషితం=పంపడమైనది, తత్+ఉపగమనీయమ్=అది స్వీకరించబడుగాక! వాచికం+చ=చెప్పవలసిన సమాచారం కూడా, ఆప్తతమాత్+సిద్ధార్థకాత్=అత్యన్త ఆప్తుడైన సిద్ధార్థకుడి నుంచి, శ్రోతవ్యం+ఇతి=వినవలసిది – అని.
వ్యాఖ్య:
ఈ లేఖలో ప్రత్యేకత గూఢత. ఎవరి పేరులూ ప్రస్తావించకుండా, ఎవరో ఎవరికో, ఎందుకో పంపినట్టుగా వ్రాయడం జరిగింది.
యథాస్థానం అంటే పాటలీపుత్రం; ఎక్కడ నుంచి (కుతః) అంటే మలయకేతు శిబిరం నుంచి; కః+అపి=అంటే రాక్షసమంత్రి నుంచి; కం+అపి+పురషవిశేషం=అంటే చంద్రగుప్తుణ్ణి ఉద్దేశించి; అస్య+ప్రతిపక్షమ్=అంటే చాణక్యుడు. సత్యవాది అంటే చంద్రకేతువు. ఏతేషాం అంటే మేఘనాథుడు మొదలైనవాళ్ళు. ఉపకారీ+సత్యసన్ధః – అంటే చంద్రగుప్తుడు. అశూన్యార్థం=అంటే “రిక్తతను పరిహరించడం కోసం”.
సారాంశం: చంద్రకేతువు శిబిరం నుంచి రాక్షసమంత్రి చంద్రగుప్తుడిని ఉద్దేశించి పంపిన లేఖగా ఇది కూట సృష్టి. లేఖతో పంపిన పెట్టెలోని మూడూ నగలు – ఒకప్పుడు చంద్రకేతువు రాక్షసమంత్రికి కానుకగా ఇచ్చినవి.
మలయ:
భాగురాయణ, కీదృశో లేఖః?
అర్థం:
భాగురాయణ, కీదృశః+లేఖః=ఏమిటీ లేఖ? (లోని అంతరార్థం?)
భాగు:
భద్ర, సిద్ధార్థక, క స్యాయం లేఖః?
అర్థం:
భద్ర=నాయనా, సిద్ధార్థకా, అయం+లేఖః+కస్య=ఈ ఉత్తరం ఎవరిది?
సిద్ధార్థ:
అజ్జ, ణ అణామి. (ఆర్య, న జానామి.)
అర్థం:
ఆర్య=అయ్యా, న+జానామి=నేనెరుగను.
భాగు:
హే ధూర్త, లేఖో నీయతే న జ్ఞాయతే కస్యా య మితి! సర్వం తావత్ తిష్ఠతు. వాచికం త్వత్తః కేన శ్రోతవ్యమ్?
అర్థం:
హే+ధూర్త=ఓయ్ మోసకారి!, లేఖః+నీయతే=ఉత్తరం తీసుకుని వెడుతున్నావు. అయం+కస్య+ఇతి= ఇది ఎవరికి అనేది, న+జ్ఞాయతే=నీకు తెలియదు! (అవునా!), తావత్+సర్వం+తిష్ఠతు=అయితే -మిగిలినదంతా అలా ఉండనీ; త్వత్తః=నీ నుంచి, వాచికం=ముఖతః చెప్పవలసినది, కేన+శ్రోతవ్యమ్=ఎవరు వినవలసి ఉంది?
సిద్ధార్థ:
(భయం నాటయన్) తుమ్హేహిం. (యుష్మాభిః)
అర్థం:
(భయం+నాటయన్=భయాన్ని ప్రదర్శిస్తూ) యుష్మాభిః=మీరే (మీ చేతనే) వినాలి.
భాగు:
కిం? అస్మాభిః?
అర్థం:
కిం=ఏమీ? అస్మాభిః?=మేము వినాలా? (మా చేత వినబడాలా?)
సిద్ధార్థ:
మిస్సేహిం గహీదో ణ ఆణామి కిం భణామిత్తి। (మిశ్రై గృహీతః న జానామి కిం భణా మీతి।)
అర్థం:
మిశ్రై+గృహీతః=అయ్యగార్లు పట్టుకున్నారు (పట్టుకోబడ్డాను). కిం+భణామి+ఇతి+న+జానామి=ఏమి చెపుతున్నానో నేనెరుగను..
భాగు:
(సరోషమ్) ఏష జానాసి. భాసురక, బహిర్నీత్వా తావత్తాడ్యతాం యావ త్కథయతి.
అర్థం:
(స+రోషమ్=కోపంగా), ఏష+జానాసి=ఇలాగ తెలుసుకుంటావు. భాసురక, బహిః+నీత్వా=బయటకు తీసుకువెళ్ళి, యావత్+కథయన్తి+తావత్+తాడ్యతాం=చెప్పేవరకు తన్నండి.
పురుష:
జం అమచ్చో అణ వేది – (ఇతి తేన సహ నిష్క్రమ్య పునః ప్రవిశ్య) అజ్జ, ఇఅం ముద్దాలంచ్ఛిదా పేడిత తస్సకక్ఖాదో ణివడిదా. (య దమాత్య ఆజ్ఞాపయతి… ఆర్య ఇయం ముద్రాలాఞ్ఛితా పేటికా తస్య కక్షాతోనిపతితా.)
అర్థం:
(యత్+అమాత్య+ఆజ్ఞాపయతి=మంత్రిగారు ఆదేశించినట్టే (చేస్తాను) – ఇతి =అని, తేనసహ+నిష్క్రమ్య=వాడితో కూడా (సిద్ధార్థకుడితో) వెళ్ళి, పునః+ప్రవిశ్య=మళ్ళీ వచ్చి) ఆర్య=అయ్యా, ఇయం+ముద్రాలాఞ్ఛితా+పేటికా=(రాక్షసమంత్రి) ముద్ర వేసి ఉన్న పెట్టె, తస్య+కక్షాతః+నిపతితా=వాడి చంకలోంచి జారిపడింది.
భాగు:
(విలోక్య) కుమార, ఇయ మపి రాక్షస ముద్రాలాఞ్ఛి తైవ॥
అర్థం:
(విలోక్య=చూసి), కుమార=రాకుమారా, ఇయం+అపి=ఇది కూడా, రాక్షసముద్రా+లాఞ్ఛిత+ఏవ=రాక్షసమంత్రి ముద్రతోనే ఉన్నది.
మలయ:
సఖే, అయం లేఖస్య అశూన్యార్థో భవిష్యతి. ఇమా మపి ముద్రాం పరిపాలయన్ ఉద్ఘాట్య దర్శయ.
అర్థం:
సఖే=మిత్రమా, అయం=ఇది, లేఖస్య+అశూన్యార్థః+భవిష్యతి=ఉత్తరంలో పేర్కొన్న కానుక అయి ఉంటుంది. ఇమాం+అపి+ముద్రాం+పరిపాలయన్=ఈ ముద్రను కూడా కాపాడుతూ, ఉద్ఘాట్య+దర్శయ=తెరచి చూపించు.
(భాగురాయణః తథా కృత్వా దర్శయతి)
అర్థం:
(భాగురాయణః+తథా+కృత్వా=భాగురాయణుడు అలాగ చేసి, దర్శయతి=చూపిస్తున్నాడు).
మలయ:
(విలోక్య) అయే, త దిద మాభరణం మయా స్వశరీరా దవతార్య రాక్షసాయ ప్రేషితమ్। వ్యక్తం, చన్ద్రగుప్తస్య లేఖః॥
అర్థం:
(విలోక్య=చూసి) అయే=అరే!, తత్+ఇదం+ఆభరణం=ఆ ఈ నగ, మయా=నేను (నా చేత), స్వ+శరీరాత్+అవతార్య=నా వంటి మీద నుంచి తీసి, రాక్షసాయ+ప్రేషితమ్=రాక్షసమంత్రి కోసం పంపినది (పంపబడినది). వ్యక్తం=తెలిసిపోయింది; లేఖః=ఉత్తరం, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తునికి.
భాగు:
కుమార, ఏష నిర్ణీయత ఏవ సంశయః, భద్ర, పునరపి తాడ్యతామ్॥
అర్థం:
కుమార=రాకుమారా, ఏష+సంశయః=ఈ సందేహం, నిర్ణీయత+ఏవ=నిశ్చయం కాగలదులే. (పురుషునితో), భద్ర=నాయనా (భాసురకా), పునః+అపి+తాడ్యతామ్=మళ్ళీ తన్నండి.
పురుష:
తథా. (ఇతి నిష్క్రమ్య, సిద్ధార్థకేన సహ పునః ప్రవిశ్య). ఏసో ఖు తాడి అమాణో కుమారస్స ఎవ్వ ణివే దేమిత్తి భణాది. (ఏష ఖలు తాడ్యమానః కుమారస్యైవ నివేదయామీతి భణతి)
అర్థం:
తథా=అలాగే. (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పునః+సిద్ధార్థకేన+సహ+ప్రవిశ్య=మళ్ళీ సిద్ధార్థకుడితో ప్రవేశించి) – తాడ్యమానః=తన్నులు తింటూ, ఏషః+ఖలు=వీడైతే, కుమారస్య+ఏవ+నివేదయామి+ఇతి=రాకుమారునికే మనవి చేస్తానని – భణతి=అంటున్నాడు.
మలయ:
తథా భవతు.
అర్థం:
తథా+భవతు=అలాగే కానియ్యి.
సిద్ధార్థ:
(పాదయోర్నిపత్య) అభపణ మే పసాదం కరేదు అజ్జో. (అభయేన మే ప్రసాదం కరోత్వార్యః.)
అర్థం:
(పాదయోః+నిపత్య=కాళ్ళ మీద పడి), ఆర్యః=అయ్యగారు, అభయేన+మే+ప్రసాదం+కరోతు=నాకు అభయం ఇచ్చి అనుగ్రహించాలి.
మలయ:
భద్ర, అభయ మేవ పరవతో జనస్య, నివేద్యతాం యథావస్థితమ్॥
అర్థం:
భద్ర=నాయనా, పరవతః+జనస్య=పరాధీనుడైన వ్యక్తికి (నీకు), అభయం+ఏవ=అభయమే (ఇస్తున్నాను),యథా+అవస్థితమ్=ఉన్నదున్నట్టు, నివేద్యతాం=మనవి చెయ్యాలి.
(సశేషం)