పదసంచిక-35

0
5

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కలవల కంపరములో గజిబిజి గందరగోళం (6)
4. స్థానిక వృత్తాంతము, చరితము (4)
7. పోతన చివర లోపించిన విష్ణువు (2)
8. సినిమాగా మలచబడిన ఒక యద్దనపూడి నవల (2)
9. త్యాగరాజస్వామి వారి కీర్తనలలో బహుళ ప్రజాదరణ పొందిన కీర్తన (7)
11. పుష్పమాలిక (3)
13. సెల్ఫిష్ నెస్ (5)
14. మంచి పనులు. (5)
15. తేలికి వ్యతిరేకం (3)
18. ఎన్‌సైక్లోపీడియా (3,4)
19. లా (2)
21. కోడికూత వేళ కుత్సితుడు వచ్చాడు(2)
22. బిందు సహిత సతతము సతతమే (4)
23. తగర చెట్టు (6)

నిలువు:

1. తపోలోకములో పావురము (4)
2. కలతపడిన తీగ (2)
3. ఒక పదానికి బదులుగా వాడే అదే అర్థం గల పదం (5)
5. మీనాలయములో కలిసిన యమునా నది (2)
6. తుత్తునియలు (6)
9. ఆంధ్రజ్యోతి దినపత్రికలో గమనం అనే కాలమ్ నడిపిన రాజకీయ విశ్లేషకుడు. (5,2)
10. వ్రతములు ఆచరిస్తే చేకూరునది వితరణ పుణ్య సిద్ధి? (4,3)
11.  పూజితములో పరిశుద్ధమైనది (3)
12. ఎదగకుండా ముదిరిన అనే అర్థంలో రావిశాస్త్రి ప్రయోగించిన పదం. కానీ ఇక్కడ తారుమారయ్యింది. (3)
13. సభ ప్రారంభంలో అతిథులను ఆహ్వానిస్తూ చేసే ప్రసంగం (6)
16. కాణాచి. స్థానం వారి నివాసం (5)
17. ఇంచీ (4)
20. నియంతలో మావటీడును వెదకండి. (2)
21. నలకూబరుడిలో శిశువు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 19 తేదీన వెలువడతాయి.

పదసంచిక-33 జవాబులు:

అడ్డం:                                 

1.ఆదరాబాదరా  4.కూజితము  7.సఫా  8.రిమ్మ  9.అంటరానివేలుపు  11.కుడితి  13.జవాబుదారు 14.రసపుత్రులు 15.బక్షీసు 18.పుష్పరసాహ్వయము  19.సరే 21.జావ 22.ముఖమలు 23.రంధ్రాన్వేషణము

నిలువు:

1.ఆసనము  2.దఫా 3.రామునిదాడి  5.తరి 6.ముమ్మనుమరాలు  9.అండజంబుపానుపు 10.పుక్కిటిపురాణము 11.కురుబ 12.తిరసు 13.జఠరరసము 16.క్షీరసాగరం 17.చెలువము 20.రేఖ 21.జాణ

పదసంచిక-33కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • ఈమని రమామణి
  • బయన కన్యాకుమారి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • సరస్వతి పొన్నాడ
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here