సంచిక-సాహితీ 2020 ఉగాది కథా సంకలనానికి కథలకి ఆహ్వానం

0
3

[dropcap]క[/dropcap]స్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్ సంపాదకత్వంలో సంచిక వెబ్ పత్రిక, సాహితి ప్రచురణల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాదికి వెలువడే కథా సంకలనంలో ప్రచురణ కోసం కథలను పంపవలసిందిగా రచయిత(త్రు)లను ఆహ్వానిస్తున్నాం.

మన మాతృభాష అయిన తెలుగు భాష ఔన్నత్యం, ప్రాధాన్యం, విశిష్టతలను తెలియజేసే కథలను ఈసారి సంకలనంలో ప్రచురించదలచాం. రచయితలు ఈ అంశం కేంద్రంగా కల తాము రచించిన కథలను పంపవచ్చు. అలాగే తమకు తెలిసిన మంచికథలు ఈ అంశం ఆధారంగా సృజించినవి తెలపాలని మనవి. రచయితలు ఈ అంశంగా కొత్త కథ రాసి పంపితే వాటిని సంచిక వెబ్ పత్రికలో ప్రచురిస్తాము. మా ప్రామాణికాలలో వొదిగితే సంకలనంలోనూ చేరుస్తాము.

అనువాదాలు, అనుకరణలు, అనుసరణలు పరిశీలనకు పంపరాదు. మీ కథలు ఏ వ్యక్తిని కానీ, వర్గాన్ని కానీ కించపరచేలా వుండరాదు. అవి ఎటువంటి వివాదాలకు తావివ్వరాదు. మీ కథలు వ్రాసి/టైపు/డి.టి.పి. చేయించి కొరియర్ లేదా పోస్టు లేదా ఇ-మెయిల్ లేదా వాట్సప్ ద్వారా మాకు 29 ఫిబ్రవరి 2020లోగా అందేలా పంపాలి. కథల ఎంపికలో సంపాదకులదే తుది నిర్ణయం.

మీ రచనలు పంపవలసిన చిరునామా:

కస్తూరి మురళీకృష్ణ
ప్లాట్ నెం.38, ఇం.నెం. 8-48,
ఆదిత్య హాస్పిటల్ సందు,
రఘురాం నగర్ కాలనీ,
దమ్మాయిగూడ, హైదరాబాదు 500083
e-mail: kmkp2025@gmail.com
WhatsApp: 9849617392

కోడీహళ్లి మురళీమోహన్
ఫ్లాట్ నెం.402,
ఆనందసాయి రెసిడెన్సీ
రోడ్ నెం. 2,
కె.ఆర్.సి.ఆర్.కాలనీ,
బాచుపల్లి
హైదరాబాదు 500090
e-mail: mmkodihalli@gmail.com
WhatsApp: 9701371256

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here