భరతమాతకు జై అనాలని
రాజ్యంగము నందు లేదట
మతోన్మాదుల మత్తు ప్రేలా
పనలు హద్దులు దాటెనంట
మాతృభూమికి వందనమ్ము
ప్రతి మనిషి కర్తవ్యమే గద!
కూడుబెట్టిన, నీడ నిచ్చిన
కన్న నేలకు, కృతఘ్నతలా?
మతోన్మాదము మత్తు కమ్మిన
దానవత్వము వింత చేష్ట.
దుర్గమారణ్యములందు
ఉగ్రవాదుల ప్రజాసేవలు
సమసమాజ స్థాపనకమ్మని
ధ్యేయమందురు ధైర్యముగను.
ప్రజాస్వామ్యము బూటకమ్మని
ఆయుధము చేపట్టారట.
బతుకుబాటను బుగ్గిపాలు
చేసుకొను టావేశమే గద!
నేటుగా అన్యాయముల నెది
రించుటే సమన్యాయ మందురు.
మద్యమును సేవించడము బహు
నష్టమందురు మానవులకు
పాలకు లైసెన్సు లిచ్చిరి
బారులు మద్యము షాపులకును.
తెలెగి ఊగిరి తాగుబోతులు
ప్రాణముల గాపాడుగొనక.
ప్రజారోగ్యము, ప్రజాక్షేమము
ప్రభుత్వము కర్తవ్యమౌను.
కుటుంబాలలో చిచ్చు రేగెను
కుంటుబడె సంసారమంత.