[dropcap]అ[/dropcap]దిగో ప్రసూతి గది
గురువు మంత్రసానిలా,
పురుడు పోస్తున్నాడు.
జ్ఞానం వెలుగు చూసేందుకు,
తహ తహ లాడుతూ
శక్తి నంతా కూడా గట్టుకుని
చీకటి సైతం చీకటి చీల్చుకు వస్తుంది.
అక్కడే అక్కడే
వెలుగు చూసాయి
విప్లవ భావాలు
ఊహలు ఊపిరి పూసుకున్నాయి
ఒక డాక్టరు
ఒక ఇంజినీరు
ఒక కథకుడు
ఒక విప్లవకారుడు
ఒక సంస్కర్త
ఎందరో ఎందరో
ఇంకా ఎందరో
అందరికి పురుడు పోసిందా గది,
ఏ గది?
మన తరగతి గది.