[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కష్టసాధ్యమైన అభీష్టము (3,3) |
4. పంచాయతి కాదు ఐదు సంవత్సరాలు నిండిన కన్య.(4) |
7. కొంచెం ముసలితనం (2) |
8. ముద్రబల్ల కవి దేవదానంరాజు గారి ఇంటిపేరు. (2) |
9. అష్టాదశ పురాణాలలో పదకొండవది (3,4) |
11. వనజక్క వద్దనున్న చక్రవాకము (3) |
13. దేవతాశిల్పి తనలోని కులాన్ని చివరికి తోసేశాడు. (5) |
14. భూములను, ఇళ్లను కోల్పోయినవారు (5) |
15. అజ్ఞాతవాసంలో గాడిద (3) |
18. అదే నేల పేరుతో భారతీయ కవిత్వాన్ని అందించిన కవి (3,4) |
19. కమల ముందరి సొంపు(2) |
21. గంధగజమ వెనుకటి రాబడి (2) |
22. భట్టి చప్పిటిముక్కుతో తీతువుపిట్ట (4) |
23. 1957 నాటి పౌరాణిక సినిమా. కెంపరాజ్ హీరో. (2,4) |
నిలువు
1. గొడ్రాలు (4) |
2. తెలకపల్లి రవి పొట్టిపేరు (2) |
3. పొలములో సాగుచేయు మొక్కలు రాకుండ పెరిగిన ఇతర జాతిమొక్క (5) |
5. సూకరమా అంటే తగినశాస్తి (2) |
6. తెలుగు ప్రయోగనాటక పితామహుడు (2,4) |
9. అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి వ్రాసిన ప్రబంధ కావ్యము (2,5) |
10. రెండు బొంకుల దరహాసము (7) |
11. దద్దమ్మ కాబట్టే చెదిరిపోయాడు. (3) |
12. ఒకనాటి స్త్రీల మాసపత్రిక (3) |
13. 80,82ల సగటు (3,3) |
16. ఏదైనా ఒక సందర్భంలో చేసే సామూహిక భోజనం (5) |
17. అడ్డం 23లోని నటి. సింగిల్ పీస్. (4) |
20. అమరావతి నిర్మాణానికి మోడీ ఇచ్చింది. (2) |
21. నాయుని కృష్ణమూర్తి రాసిన భారతం. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఫిభ్రవరి 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 9 తేదీన వెలువడతాయి.
పదసంచిక-36 జవాబులు:
అడ్డం:
1.ప్రవేశపరీక్ష 4.నెలవంక 7.త్యాగం 8.తన 9.ఆడుమగాడ్రాబుజ్జి 11.దుడుకు 13.ఉదకమేహి 14.కలకాలము, 15.తనివి 18.ముయ్యదకసినుమి 19.డమే 21.యాస 22.లంఘనము 23.ముత్యాలపందిరి
నిలువు:
1.ప్రత్యామ్నాయం 2.వేగం 3.క్షతగాత్రుడు 5.వంత 6.కనకాంబరము 9.ఆధునికకాలము 10.జ్జిబయకాపరమి 11.దుహిత 12.కుకవి 13.ఉదకమండలం 16.నిర్వికల్పము 17.సొగసరి 20.మేఘ 21.యాది
పదసంచిక-36కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.ఝాన్సీరాణి
- సరస్వతి పొన్నాడ
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.