[dropcap]హి[/dropcap]మాలయపు సానువులో
కాశ్మీరపు లోయల్లో
డెన్ విడిచి గన్నుపట్టి
ఎముకలు కొరికే చలిలో
పహరాగా తిరుగుచుండి
కంచ దాటు ముష్కరులను
మంచులోనె పాతిపెట్టు
సైనికుడా! నీకు జోహార్లు!
గుజరాత్ మహా భూమిలో
రానాఫ్ కచ్ పంకములో
ఉప్పునీటి కయ్యలలో
మొలబంటి బురదలలో
మొరాయించు వాహనముల
చెలాయించి శత్రువులను
మట్టి కుడిపి పీచమణచు
సైనికుడా! నీకు జోహార్లు!
రాజస్థాన్ థార్‌లో
ఇసుక తుఫాన్ హోరులో
పగలనక రాత్రనక
వీపులు మండే ఎండలో
ఒంటెలపై గస్తీ తిరిగి
సరిహద్దులు దాట జూచు
పాకిస్తాన్ పందులను
ఇసుకలోనే పాతిపెట్టు
సైనికుడా నీకు జోహార్లు!
తూర్పు పడమర దిక్కులలో
సుదీర్ఘమైన తీరములో
దినమంతా విసుగులేక
గస్తీ తిరిగి సముద్రముపై
బుక్కోడల పేల్చివేసి
శత్రువులను చెరపట్టిన
సైనికుడా! నీకు జోహార్లు!
కాశ్మీరపు చలిపులిలో
రాజస్థాన్ ఎండలలో
గుజరాత్ ఉప్పు బురదలలో
అస్సాం చిట్టి అడవులలో
అగాధమగు జలాలలో
గన్నుపట్టి వెన్నుతట్టి
దన్నుగున్న సైనికుడా
జోహార్లు! నీకు జోహార్లు!