[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పసిక కలిగియున్న సూర్యుడు (6) |
4. బసవపురాణంలోని బాల భక్తురాలు (4) |
7. అప్పలస్వామి కడుపులో నిక్షేపము (2) |
8. ఆగు (2) |
9. వెనుదిరిగిన ప్రేమయుద్ధం (4,3) |
11. దాత చేతికి ఇది వుండదా? (3) |
13. చెరసాల కటకటా! (5) |
14. పద్ధతిని పూవు చేర్చితే కుబేరుని వాహనం రాదూ!(5) |
15. చైనా వైరస్ బూచి (3) |
18. మెత్తని పఱుపు (7) |
19. నడుములేని రాధిక ఆగమనం (2) |
21. ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి తిట్టును వెదకాలా? (2) |
22. పల్లెవాడి ఉక్రోషం (4) |
23. కనికట్టు లాంటి మాయ మోసాలు (6) |
నిలువు
1. అకారముయొక్క రూపాంతరనామము (4) |
2. బెల్లముతో చేసిన ఒక తినుబండారము (2) |
3. సమూహం చేయితో పనిముట్టు (5) |
5. __ దున్న కంటే గుడ్డి దున్న మేలు (2) |
6. భయముతో చివాలున క్షుద్రము (6) |
9. హంస హంసే, కాకి కాకే అని చాటే సంస్కృతన్యాయము శీర్షాసనం వేసింది. (7) |
10. సర్కారు తలపు (4,3) |
11. కుడితిలో పడ్డ ___ లాగ తప్పించుకోలేని విధంగా దొరికిపోయాడు. (3) |
12. అడ్డం 15 కాదు సైఫ్ అలీఖాన్ శ్రీమతి (3) |
13. కట్టెలమోపు, నల్లకలువ, నీలికేక ఇత్యాది రచనలను సృష్టించిన హేతువాద రచయిత. (2,4) |
16. సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల (5) |
17. మొగుడుపెళ్ళాలు (4) |
20. వాంతి (2) |
21. బూదరాజు రాధాకృష్ణ ఊదేది (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఫిభ్రవరి 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 16 తేదీన వెలువడతాయి.
పదసంచిక-37 జవాబులు:
అడ్డం:
1.రాజకీయఖైదీ 4.అధినేత 7.జగ్గు 8.ముప్పు 9.నాలుగుస్తంభాలాట 11.ఆముదం 13.అగ్నిప్రవేశం 14.డిపోలఅరు/డిఅలపోరు 15.సవిత 18.నదవఖముజగ 19.వడి 21.పీపా 22.కపోలము 23.మునిసిపాలిటి
నిలువు:
1.రాజధాని 2.జగ్గు 3.దీపస్తంభము 5.నేము 6.తప్పులెన్నువారు 9.నాటకప్రదర్శన 10.టపాసులపండుగ 11.ఆశంస 12.దండిత 13.అవకతవక 16.విశృంఖలము 17.పరిపాటి 20.డిపో 21.పీలి
పదసంచిక-37కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.ఝాన్సీరాణి
- సరస్వతి పొన్నాడ
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.