ఎప్పు

13
3

“అకా ఎప్పుమజ్జిగ వుంటే రవంత ఈకా”

“అదేమి నీలి మీ ఇంట్లో మజ్జిగకి కొదవా?”

“కొదవ కాకుండా ఇంగేమికా, నా మొగుడు ఎబుడు చూసినా
పంచకట్టుకొని ఓసూరు పేటకి తిరిగేకి పోతాడు నేను ఒగతే
ఎట్ల అన్ని ఆవులని చూసుకొనేది. పాలు ఎట్ల పిండేది. దాన్నింకానే
ఒగ పాలు పిండే ఆవు, ఒగ ఫలము అవు సాలని మిగిలినవన్నీ
అమ్మేస్తినికా”

“అవునా?”

“ఊకా”

“అయితే ఇల్లు ఎట్ల గడిచేది?”

“ఆవులు అమ్మిన కాసుల్ని వడ్డికి ఇచ్చిండాకా, ఆ వడ్డి కాసుల
జతకి ఈ రెండు ఆవుల్ని బాగా సాకొంటే సాల్దాకా”

“అది సరే అనుకో…. దినానికి 10 లీటర్ల పాలు డైరికి పోస్తావా?”

“ఇంగా జాస్తీగానే పోస్తాకా”

“అట్లయితే నీకేం నువ్వు నీ ఇంటికి రాణివి పోవే”

“నిదానముగా అనుకా, ఆ త్యాపిలి గౌరి యింటే నా మొగునికి
లేనిపోని మాటలు చెప్పి కావాలంటే నా కాపురానికే ఎప్పు
పెట్టిస్తుందికా”

“అదీ నిజమే ఇందా నువ్వు అడిగిన ఎప్పు మజ్జిగ”

“సరేకా… వస్తాకా”

***

ఎప్పు = తోడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here