[dropcap]క[/dropcap]ల చెదిరిందా?
బాధ పడకు.
మళ్ళీ రేపటి నిద్రలో
మరో మంచి కల వస్తుందిలే.
వ్యధ చేకూరిందా?
కించ పడకు
గుండె దిటవు చేసుకో
గొడ్డలి పెట్టునైనా తట్టుకోగలదు
అదిగో చూడు
నీరుగ మారిన మంచు
నీలా
నీరుగారిందా?
సెలయేరుగ మారి,
పరుగులు తీస్తుంది.
పదా నీవు కూడా వెంట నడువు
నడిపించేందుకు నేనున్నాను.