‘కులం కథ’ పుస్తకం – ‘ఊడల మర్రి’ – కథా విశ్లేషణ

0
3

కావలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ బైపిసి చదువుతున్న కె. షారోన్ రోజా ఈ పుస్తకంలోని ‘ఊడల మర్రి’ కథను విశ్లేషిస్తోంది.

***

చిలుకూరి దేవపుత్ర గారు రచించిన ‘ఊడల మర్రి’ కథలోని ముఖ్యాంశాలు:

ఈ కథలో కూడా కులాన్ని అవమానిస్తూ మాట్లాడడం అనేది మనం గమనించవచ్చు.

ఇందులో:

  • ఈ కథంతా ఎలక్షన్ గురించే లిఖించబడింది.
  • ఇందులో రచయిత వీళ్ళ స్నేహితుడు మున్నగువారు పాత్రలు.
  • ఈ కథలో భీమప్ప ముప్పయి అయిదేళ్ళ నించే పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చాడు.
  • కాని ఇతను మాత్రం కులాలను హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇతన్ని మాత్రం అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే ఇతని దగ్గర డబ్బు, పదవి, గౌరవం ఉన్నాయి. అందువలన ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని గౌరవిస్తారు.
  • రచయిత స్నేహితుడు హనుమంతరాయుడు మాటలు మాత్రం చాలా బాగున్నాయి.
  • వీళ్ళిద్దరూ, మున్నగువారు భోజనానికి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ ఆఫీసరును చూపించమంటునప్పుడు, భీమప్ప ఇందులో కూడా వాడు పనిచేస్తున్నప్పుడే వాడిని వాళ్ళకి చూపిస్తాడు.
  • రచయిత, స్నేహితుడు హనుమంతరాయుడు తెల్లముఖాలు వేసుకుని చూస్తారు.
  • ఎలక్షన్ అయిన తర్వాత భీమప్ప జతగాడు ఓబులుని ప్రమాణ స్వీకారం చేయడానికి పిలిచినప్పుడు ఓబులు తన అయ్య ఎదురుగా కూర్చవాలంటే కూడా ఎంత విధిగా అవుతాడు. కాని ఈ కథలో భీమప్ప ప్రేక్షకుల్లో నిల్చోమంటే ఎంత సిగ్గుగా అవమానంగా కోపంగా తలదించుకుంటాడు.
  • కాని ఓబులుని ప్రమాణస్వీకారం చేయమన్నప్పుడు బీమప్ప వాడిని ఒక మాట అంటాడు ఏందంటే – “అండీ, గుండీ, గారూ గీరూ అంటే ఇంటాడా ఆ మాల నాకొడుకు నేను పిలుస్తాను సూడండి అంటూ ఒరేయ్ ఓబుళ్లుగా రావయ్ ‘నీయమ్మ’ లోపలికిరా” అంటాడు.
  • అసలు తెలుగులో ‘నీయమ్మ’ అంటే మన అమ్మనే అవమానించడం అనేది ఈ కథలో చూస్తాం.
  • చివరిగా ఏందంటే రచయిత మాటల్లో

ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా దశ దిశలూ వ్యాపించిన ఈ వ్యవస్థ ఊడల మర్రి కింద ఏ మొక్కయినా బతుకుతుందా అనిపించింది ఆ క్షణంలో ఈ రచయితకి.

  • ఇది చాలా వాస్తవం ఈ కథలో ఎలాగంటే

ఉన్నవాళ్ళు లేని వాళ్ళను ఎంత అమర్యాదగా చూస్తారో వాళ్ళు మనల్ని కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తారు.

  • ఈ బుక్‌కు సరిగ్గానే కులం కథ అనే పేరు పెట్టి ఉంటారు. ప్రత్యేకంగా ఈ కథకి ఊడల మర్రి అని పేరు బాగా పెట్టారు.

కె. షారోన్ రోజా,

సీనియర్ బైపిసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here