ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర – పుస్తక పరిచయం

0
3

[dropcap]ప్ర[/dropcap]తీ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్టే ప్రత్యేక సాహిత్య చరిత్ర కూడా ఉంటుంది.

‘అన్ని జిల్లాల సాహిత్య చరిత్రల సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు మాత్రమే సమగ్ర తెలంగాణా సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ భావించింది. ఆ సంకల్పంతో ముప్ఫయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింద’ని తెలంగాణా సాహిత్య అకాడమీ పుస్తకానికి ముందుమాటలో ప్రకటించింది. దాని ఫలితంగా ఈ పుస్తకం రూపొందింది.

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది. ఓ జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర, ప్రాచీన, ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథా, నవల, నాటకం, విమర్శ వంటి ప్రక్రియలను ఈ పుస్తకం ప్రస్తావించింది.

‘గత వంద సంవత్సరాల ఆదిలాబాద్ జిల్లా సాహిత్యాన్ని పరిశోధించి జిల్లా సాహిత్య చరిత్ర రాయడం జరిగింది. ఈ క్రమంలో గతంలో మరచిపోయిన కొందరు కవులు, రచయితల్ని సాహిత్య చరిత్ర పుటల్లో చేర్చడం జరిగింది’ అని రచయిత డా. ఉదారి నారాయణ ‘రెండు మాటలు’లో రాశారు.

***

ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర
రచన: ఉదారి నారాయణ
పేజీలు: 108
వెల: రూ. 40/-
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ,
కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం,
హైదరాబాద్ -4.
ఫోన్: 040-27703142

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here