[dropcap]ఆ[/dropcap]గు.
ఏమా వేగం
ఏమా తహతహ
ఏమా ఉరుకు
ఓహో వయసా
అంత దీక్షగా వెతుకుతున్నావ్
అర్థం కోసమా
ప్రేమ కర్థం కావాలా
పదాలు చెప్పలేవు ప్రేమకు అర్థం
పెదాలు పలుక లేవు దాని పరమార్థం
అమ్మ ముఖం కేసి చూడు
అర్థం గోచరిస్తుంది.
పరమార్థం బోధ పడుతుంది.