‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. చివరి భాగం (4) |
4. విసురుకునేది (4) |
7. చెరిపినా చెరగనిది(2) |
8. ఇది చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది (2) |
9. విధము (2) |
10. ‘దీనికి’ అన్న ఉన్నాడు (4) |
11. ముక్కుకి అందం (3) |
14. కారణం (3) |
16. మొహమాటం (3) |
18 . అభ్యర్థన (3) |
20. నవజాత శిశువుకు కలిగేవ్యాధి (2) |
21. ఏనుగు(2) |
22. ఒక మహర్షి (3) |
23. పొగరు (2) |
24. ఈమె పేరుతో ఒక వంశం(2)
25. కత్తిపిడి (2) |
26. యుధ్ధం గతి తప్పింది(2) |
నిలువు:
1. పక్షి పిల్ల (4) |
2. రాజ మార్గము (2) |
3. ఎద్దు వీపుపై వేసే గంత (3) |
5. పిక్కల పై భాగం (4) |
6. వెండి (4) |
9. మట్టి త్రవ్వడానికి వాడేది(2) |
12. తీపి చెదిరింది (3) |
13. గ్రామాలలో పండగ వంటిది (3) |
15. ఒక ఊరు (2) |
16. చేపలు పట్టేవాడు (4) |
17. నిప్పురాజేసేది కొంచంగా అటూ ఇటూ (4) |
18. పుష్పం (2) |
19. తినదగినది (4)
21. లెక్కలు వ్రాసేవాడు (3) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 మార్చి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక మార్చి 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 ఏప్రిల్ 2020 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- 2 సమాధానాలు:
అడ్డం:
- గాంగేయుడు 4. రజతము 7. వశ 8. వల్కము 9. అల 11. అవము 12. బ్రద్దర 13. సలహా 16. తిరుడు 17. రుమ 18. బంధము 21. ముదిమి 23. జమలిక 24. త్రోపు
నిలువు:
- గాండీవము 2. యుక్తి 4. జన్య 5. ముసలము 6. శల్కము 9. అవహారుడు 10. అద్దము 11. అలతి 14. ధారుణిజ 15. అంధము 19. ముదిత 20. ర్యాలి 22. ప్రాపు
సంచిక – పదప్రహేళిక- 2కి సరైన సమాధానాలు పంపినవారు:
వచ్చిన పూరణలలో ఒక్కరూ సరైన సమాధానాలు పంపలేకపోయారు.