[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న ఎస్. భావన ఈ పుస్తకంలోని ‘మంచితనానికి కులమేమిటి?’ కథను విశ్లేషిస్తోంది.
***
సంచిక తెలుగు సాహితీ వేదిక ప్రచురించిన ‘కులం కథ’ పుస్తకంలో నాకు నచ్చిన కథ ”మంచితనానికి కులమేమిటి?’. ఈ కథలోని పాత్రలను కుల, మతాలను చాలా చక్కగా వర్ణించారు ఎస్.పార్వతిదేవి గారు.
- నిజమే, ప్రపంచంలో మంచితనానికి కులమేమిటి, అందరు సమానమే. అందరు మనుషులే, అందరిలో ఒకే నెత్తురు ప్రవహిస్తుంది.
- మనుషులలో కులం, మతం అనే భేధం ఒక పెద్ద వ్యాధిలా వ్యాపించింది. మనసులు వేరైనా మనుషులు ఒక్కరే.
- ఈ రోజుల్లో మంచికి మంచి రోజులు లేకపోయాయి. చెడుకు మంచి రోజులు వచ్చాయి.
- డబ్బు వచ్చిన గర్వం మత్తుతో ఆదరించిన అమ్మ కష్టాలలో తన బిడ్డ దగ్గరకు వచ్చి చేయి చాచి నోరారా సహాయం అడిగితే కుదరదు, లేదు అంటూ పొమన్న వాడు ఒక మూర్ఖుడు.
- ఆదరించిన చెయ్యి అడ్డం అయ్యింది. అవసరం తీర్చిన చెయ్యి ఇష్టమైంది. కాని అదే అవసరానికి చాచిన చెయ్యి కష్టంగా మారింది.
- కొడుకు గొప్పవాడైయ్యాడు అన్నప్పుడు ఆ పిచ్చి తల్లి పడే వెర్రి సంతోషం అవధులు లేనిది. అలాంటి సమయంలో తనను (తల్లిని) మర్చిపోయేల ప్రవర్తించినప్పుడు, ఆ తల్లి పడే మానసిక క్షోభ మాటలతో, రాతలతో చెప్పలేనటువంటిది.
- కొంత మంది మనషులు పిడికిడు మెతుకులు పెట్టిన కృతజ్ఞతతో, ఆ తల్లికి అండగా నిలుస్తారు. అలాంటి వారి ఎదుగుదల ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుంది.
- చేసిన పుణ్యము, పెట్టిన చెయ్యి, ఆశ్రయం మిచ్చిన మనిషి ఎప్పుడు గొప్పవాడే. తను కులం తక్కువ వాడైనా గొప్పవాడే.
- నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసి చివరికి అవసరానికి ఆట బొమ్మలా తయార్యయేది ఒక అమ్మ మాత్రమే. అలాంటి అమ్మని చీదరించి, బాధపెట్టే మనుషులున్న రోజులు ఇవి.
- మనిషికి కులం, మతం మరియు ఎక్కువ, తక్కువ అనే భేదం కాదు కావాల్సింది. ఒక మనిషి తోడు, మంచి మనసు కావాలి. మనుషుల మధ్య ఉండాల్సింది bonding కాని variation కాదు.
- రంగు, రూపము కులం, మతం అవి అన్ని మనం బ్రతుకున్నంత కాలమే. చివరికి అందరం కలవాల్సింది మట్టిలోనే. ఈ భూమికి అందరు సమానులే.
- కులాలలో SC, ST, BC, OC అనే వివిధ రకాలుగా విభజించుకున్నది మనుషులు మాత్రమే. ఒకొక్క కులానికి ఒకొక్క దేవుడిని ఏర్పరుచుకున్నారు. కాని దేవుడి దృష్టిలో అందరు ఒక్కటే.
- ఈ కులాల వల్ల ఎన్ని ప్రేమలు, మనుషుల ప్రాణాలు మట్టిలో కొట్టుకు పోయాయి. కష్టాలలో వున్నప్పుడు ఆదుకుని గుప్పెడు మెతుకులు పెట్టేవాడు దేవుడితో సమానం, వారిని ఎన్నటికి మరవకూడదు. వీలైతే తిరిగి సమాయం చేయలే కాని ద్రోహం చేయకూడదు.
- బెల్లం వుంటే ఈగలు వాలుతాయి అనే సామెత ప్రకారం డబ్బు వుంటేనే మనుషులు వస్తారు.
- ఆలస్యం చేస్తే అమృతం కూడ విషంగా మారుతుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడ పట్టలేడు అన్నది ఎంత వాస్తవమో, కడుపున పుట్టిన బిడ్డని నమ్మలేకపోవడము అంతే వాస్తవము.
- తన చేతితో తనకంటినే పొడిపించుకునేటటువంటి సున్నితమైనది తల్లి మనసు(ప్రేమ) అటువంటి తల్లిని కాదనుకోవడం మహాపాపము.
- దెబ్బ తగిలితే కొన్ని రోజులకు మానిపోతుంది కాని, మాట మాత్రం మనసులో మచ్చలా ఏర్పడి చితి వరకు గర్తుచేస్తుంటుంది.
- నోరారా అమ్మా అన్నప్పుడు ఆ తల్లి పడే సంతోషం అలాగే నువ్వు ఎవరు అన్నప్పుడు ఆ తల్లి ప్రాణం పోయినటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది.
- ఈ కథలోని రాజగోపాలంగారు మరియు రాజమ్మగారు శివపార్వతులు వంటి వారు. ఎంత మందికి ఆకలి తీర్చి కొడుకు ఆ తల్లి వంటరి పక్షిలా మారినప్పుడు వారి యొక్క పుణ్య ఫలితాలు ఆమెకు ఎంత భరోసాని ఇచ్చాయి.
- మనిషిని, మనిషిలా గుర్తిస్తే చాలు, అదే గొప్పవాడి లక్షణం. కాబట్టి ఈ కథ ద్వారా నాకు తెలిసిన నీతి ఒక్కటే కులం మతం కాదు కావలసినది, మంచి మనసుతో చేసే గొప్ప సహాయం.
ఎస్. భావన