[dropcap]ఆ[/dropcap]కాశం మెరిసింది
చిటపట వాన కురిసింది
నేలతల్లి మురిసింది
కొమ్మలు చివుళ్ళు వేసాయి
పువ్వులు గుత్తులు పూసాయి
కోయిల కమ్మగ పాడింది
నెమలి నాట్యం ఆడింది
వసంత శోభ వచ్చింది
పండుగ కళను తెచ్చింది
బహుమతులెన్నో ఇచ్చింది
కొత్త బట్టలు వేసుకుని
పిండి వంటలు చేసుకుని
పండుగ వేడుక జరిపాము
సంతోషంగా గడిపాము
జగతికి ఆది ఉగాది
ఉగాదితోనే జనులకు యుగాది