[dropcap]ఈ[/dropcap] ఏడాది ఉగాది కంటే
ముందే వచ్చింది కరోనా మహమ్మారి
ఏమాత్రం
కరుణ లేకుండా
ఉరుకులు పరుగులతో
ఉపద్రవం మోసుకొచ్చింది.
ఈ ఏడాది ఉగాది
కవులందరిలో ఉత్సాహం
నీరు కార్చేసింది
వీధుల్లో తిరగనివ్వకుండ
విధులను నిర్వర్తించలేకుండ
వేగంగా ఊపిర్లు ఆపేసే
ప్రయత్నంలో వీరవిహారం
చేస్తుంది కరోనా.
కోయిల కూత కూడా
కరోనా, కరోనాలా వినిపిస్తుంది
కంగారుగా తిరక్కుండా
ఇంతింత కళ్ళు చేసుకుని
టివీల ముందే తిష్టవేయించింది కరోనా.
ఉగాది ఉత్సవాన్ని
కబళించి వేసింది
ఈ ఏడాది ఉగాది.