[dropcap]‘ప[/dropcap][dropcap][/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వజ్ఝల సీతారామశాస్త్రి గారి సృష్టి. (2,4) |
4. చివుకుల పురుషోత్తం గారి నవల. (4) |
7. సముద్రంలోని గాలి. (2) |
8. తిరుగుబాటు చేసిన రాజపత్ని (2) |
9. బృందా కారత్ ప్రభువు కాదు ఇంద్రుడు (7) |
11. ప్రకాష్, శంకర్, సలీంలు కలిస్తే ఇక పొగడ్తే పొగడ్త. (3) |
13. డామిట్ తారకమంత్రం అడ్డం తిరిగింది. (5) |
14. తమిళ నోరు కలిగిన వాద్యకాడు (5) |
15. కిన్నెర ఎడిటర్ మల్లికార్జునరావు గారి చప్రము (3) |
18. దాసరి రాఘవేంద్రరావు, రేలంగి రమణారెడ్డి, నాదెండ్ల అంజయ్య, వాసిరెడ్డి రంగనాయకమ్మ పాత్రలుగా కల సినిమా కుడి నుండి ఎడమకు. (4,3) |
19. కణము (2) |
21. భారము వహించు (2) |
22. రేవతీ నక్షత్రం (4) |
23. తవుడు నుండి నూనెను తీసే పద్ధతిని అభివృద్ధి చేసింది ఈ జ్ఞానసింధువే. (6) |
నిలువు:
1. ఈ ఆంధ్రాస్పెషల్ తిండిపై కొసరాజు పాట వుంది ఒక సినిమాలో (4) |
2. కబళము క్రింద నుండి పైకి (2) |
3. షార్ట్ టెంపర్ (5) |
5. వేదాగ్రణి అల్లుకున్న జడ (2) |
6. మూడు ధరలతో విష్ణువు (6) |
9. కామధేనువు (7) |
10. శీర్షాసనం వేసిన బ్రహ్మ (7) |
11. శౌర్యం (3) |
12. పలాస వారి అశ్వారూఢము (3) |
13. గన్నేరు ఆకు క్రింది నుండి పైకి (6) |
16. కశ్యపుని భార్యలలో ఇద్దరు. రాక్షసుల, దేవతల తల్లులు. (2,3) |
17. రామాయణంలో వచ్చే ఒక పాత్ర. గ్రద్ద. (4) |
20. పావడలో దాచుకున్న గారె (2) |
21. రామోజీ వద్ద కల కాలిపీట (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఏప్రిల్ 12 తేదీన వెలువడతాయి.
పదసంచిక-45జవాబులు:
అడ్డం:
1.విజయలలిత 4.భవనాసి 7.చిక్కి 8.డాక 9.కాత్యాయనీ విద్మహే 11.చిలుక 13.పిల్లకాలువ 14.మార్గశిరము 15.రజను 18.ముగ్గురు మరాటీలు 19.వేలు 21పాపా 22.టక్కులాడి 23.కలకంఠకంఠి
నిలువు:
1.విచికిత్స 2.జక్కి 3.తలనీలాలు 5.నాడా 6.సికతాతలము 9.కారణకారణము 10.హేమంతశిశిరాలు 11.చివర 12.కమాను 13.పిడకలవేట 16.జలమక్షిక 17.ఘనాపాఠి 20.లుక్కు 21.పాకం
పదసంచిక-45కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- కన్యాకుమారి బయన
- మధు తల్లాప్రగడ
- మీనా మోహన్
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పి. ఝాన్సీరాణి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- రాజేశ్వరి కనకగిరి
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.