[dropcap]బ[/dropcap]తికున్నన్నాళ్లు జన నిర్లక్ష్యం
పోయేముందు గంగనీరు కూడా కష్టం
మద్యమే తన సుహృత్తు
ఒంటరితనమే హత్తు
చచ్చినా చావనియ్యరు ఈ జనం
బతికించి మరీ చాటుతారు తమ రాతిగుండె తనం
కలికాలంలో అన్ని నగదు బేరాలే
లాభం లేనిదే శవం కాదు దహనం
ఊపిరుండగా అంపశయ్య కట్టారు
మళ్ళీ ఇప్పుడు దానిపై పూలేసి పడుకోబెట్టారు
మనుషులు ఆలోచనలకి అతీతులు
స్వార్ధానికి గురుతులు
స్వతహాగా మహానటులు
తడి గుడ్డతో గొంతు కోసే చతురులు
నా సమాధి మీద ఈ రాత
“పోయినాక పంచభక్ష పిండదానం కన్నా
పానముండగా పాయసం పెట్టు.
గడిచిన కాలాన్ని తవ్వకు,
మానిపోయిన గాయాల్ని మళ్ళీ రేపకు!”
ఇట్లు,
ముత్యాల నవ్వు