వ్యాస రచన పోటీ రద్దు ప్రకటన

0
3

[dropcap]సం[/dropcap]చిక – పంచతంత్ర స్కాలర్స్ సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించదలచిన ‘అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే!!!!!‘ అనే వ్యాస రచనా పోటీని రద్దు చేస్తున్నాము.

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్‌లో వుండటంవల్ల వ్యాసాలను సకాలంలో పంపలేకపోతున్నామని కొందరు, పోస్ట్‌లో వేశాము కానీ లాక్‌డౌన్ వల్ల అందలేదని ఇంకొందరు, ప్రస్తుత పరిస్థితుల్లో రాసేందుకు అనువయిన వాతావరణం లేదని చివరి తేదీ పొడిగించమని మరికొందరు అంటున్నారు.

అయినా సరే, వచ్చిన వాటితో సరిపెట్టుకుందామనుకుంటే అందిన వ్యాసాలలో అనేకం అంశానికి భిన్నమయిన వ్యాసాలు కావటము, అందకుండా పోస్టులో వున్నవారికి అన్యాయం చేసినట్టువుతుందన్న భావన వల్ల  ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాసాల పోటీని అయిష్టంగానే అయినా రద్దు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

తేదీ పొడిగిస్తే ఏప్రిల్ 14న ఫలితాలు ప్రకటించాలన్న ఉద్దేశం నెరవేరదు. అదీగాక అంబేద్కర్ జన్మదినం అయిపోయిన తరువాత వ్యాసాల పోటీ నిర్వహించటం అర్థవిహీనం. అయితే, ప్రస్తుతం అందిన వ్యాసాలలో ఒకటి రెంటిని ఏప్రిల్ 14న సంచికలో ప్రచురిస్తాము.

భవిష్యత్తులో మరో సందర్భంలో వ్యాస రచన పోటీని నిర్వహిస్తాము. పాఠకులకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యులము.

సంచిక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here